ఒక్కో చిత్రంతో మెరుగవుతున్న బెల్లంకొడ శ్రీనివాస్ ఈనెల 7న కవచం సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కాజల్, మెహ్రీన్ శ్రీనివాస్ కు జంటగా నటిస్తున్నారు. శ్రీనివాస్ మొదటిసారి పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. ఆదివారం విడుదలైన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఆసక్తిరేపుతోంది.

Image result for kavacham telugu movie images

ఒక విలన్ గేమ్ ఆడితే ఎలా ఉంటుందో నువ్వు చూపించావ్.. ఒక పోలీస్ ఆడితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తానంటూ శ్రీనివాస్ విలన్ కు ఛాలెంజ్ చేస్తూ హీరోయిక్ గా కనిపించాడు. పద్మవ్యూహంలో ఆగిపోవడానికి నేను అభిమాన్యున్ని కాదురా.. పోలీస్ అంటూ హీరోయిజం ప్రదర్శించాడు. శ్రీనివాస్ మామిళ్ల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.


ట్రైలర్ చూస్తే సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో ఇంట్రస్టింగా అనిపించింది. థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మరింత ఊపు తెచ్చేలా ఉంది. హీరోయిన్లు కాజల్ , మెహ్రీన్ కూడా సినిమా గ్లామర్ పెంచేస్తున్నారు.


ఈ సినిమా ఆడియో హక్కులను సొంతం చేసుకున్న ఆదిత్య మ్యూజిక్.. అన్ని పాటలను యూట్యూబ్ లో అప్ లోడ్ చేసింది. చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి , శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటలు బావున్నాయి. మరి తెలంగాణా ఎన్నికల ఓటింగ్ రోజు విడుదలవుతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: