రజనీకాంత్, శంకర్ కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా వచ్చిన ‘2.O’ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. చిత్రంలోని గ్రాఫిక్స్ వర్క్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. విడుదలై మూడు రోజుల్లోనే రూ.200 కోట్లకు పరుగులు పెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా  తొలి రోజు రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది.  ఈ చిత్రం పైరసీకి గురైనా కలెక్షన్ల విషయంలో మాత్రం ఎక్కడా డ్యామేజ్ జరగడం లేదు.

Image result for 2.0 movie

ముఖ్యంగా శని, ఆదివారల్లో థియేటర్లు 2.0 తోొ కిక్కిరిసిపోయాయి.  ఒక్క హిందీ వర్షనే రూ.63.25 కోట్లు వసూలు చేసినట్టు తరుణ్ ఆదర్శ్ తెలిపారు. గతంలో రజనీ నటించిన ‘రోబో’, ‘కబాలి’ చిత్రాలు కూడా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించాయి. ఈ వరుసలో ఇప్పుడు మూడో చిత్రంగా 2.0 చేరింది.

Related image

ఇది రజనీకాంత్ సాధించిన రికార్డ్ అని చెప్పొచ్చు. వరుసగా ఆయనవి మూడు చిత్రాలు ఈ ఘనత సాధించాయి.దక్షిణాదిలో రూ.200 కోట్లు రాబట్టిన మూడు చిత్రాలున్న కథానాయకుడుగా రజనీ సరికొత్త రికార్డ్ సొంతం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: