అందాల రాసి,  హీరోయిన్ రాశీ ఖన్నా హైదరాబాద్లో ఉంటే చిత్రపరిశ్రమలో చాలా మందికి పండగేనట. ఎవరైనా షూటింగ్‌ గ్యాప్‌ వస్తే విశ్రాంతి తీసుకోవాలని చూస్తారు. కానీ రాశి ఖన్నా మాత్రం సమయం చిక్కినప్పుడల్లా మంచి, మంచి కాన్సెప్ట్ విందులు ఇస్తుందట. ఆమె ఇచ్చే పార్టీలు ఆషామాషీ పార్టీలు మాత్రం కావట. ఆమె పార్టీ ఇస్తోందంటే అనారోగ్యం తో డల్ గా ఉన్న ప్రముఖులు సైతం మత్తు వదుల్చుకొని పసి పిల్లలలా ఉత్సాహంగా వాలిపోతారని టాక్. అనేక విందులు ఇచ్చినా ఎప్పటికప్పుడు నవ్యత సంతరించుకుని భలేగా! ఉందే అనేలా చూసుకుంటుందట అందాల రాశి. 
Image result for rasi parties alternative to prabhas
ప్రతిసారి కొత్తగా ఎలా ఉంటుంది అనుకునే అవకాశమే ఆహూతులకివ్వదట రాశి ఖన్నా. ప్రతిసారి రుచులు మారే వెరైటీ వంటలు, మధు సుమధుర పానీయాలు, అద్భుత నృత్యాలు..అమోఘమైన ఎరేంజ్మెంటులు - వీటిలో రాశి ఖన్నాని మించి చేయగల ఒకే ఒక సెలబ్రిటీ ఉన్నారట. ఆయన తరవాత రాశినే గ్రేట్ అట.  
Image result for party girl Rashi khanna
ఆ ఒకరు మాత్రం ఆమె ఇచ్చిన విందులను మించిన విందులు - వినోదాలను తలదన్నే వినోదాలను గొప్పగా చెప్పుకుంటారు. ఆయనే ప్రభాస్‌ పార్టీ ఇచ్చాడంటే దాని గురించి పది రోజులు మాట్లాడుకోకుండా ఉండలేరట. భీమవరం రాచ మర్యాదలన్నీ అతిథులకి చేసేసే ప్రభాస్‌ వంటల విషయంలో పాటించే జాగ్రత్తలకి ఎవరికైనా సమ్మోహనం అవ్వాల్సిందేనట. కైపెక్కి పోవాల్సిందేనట.
Related image
"బాహుబలి" సినిమాల తర్వాత "సాహో" లాంటి భారీసినిమాతో క్షణం సమయం చిక్కక బిజీ అయిపోయిన ప్రభాస్‌ మునుపటిలా ఇప్పుడు పార్టీలు ఇవ్వటానికి సమయం దొరకడంలేదట. ఆ లోటును సెలబ్రిటీలందరికీ ఒకచోట కలిపే అవకాశాన్ని రాశి ఇస్తుందట. బహుశ ఇందులోనైనా లెడీప్రభాస్‌ నిరూపించుకోవాలను కుంటుందేమో!   ఖచ్చితంగా ఆమె 'లెడీ ప్రభాస్' అంటున్నారు ఫిల్మ్-నగర్ వాసులు. 

Related image

మరింత సమాచారం తెలుసుకోండి: