చాలామంది యంగ్ హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి వస్తున్నా కాజల్ కు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. సీనియర్ హీరోల దగ్గర నుండి యంగ్ హీరోల వరకు తనకు నచ్చిన పారితోషికం ఇస్తే చాలు ఎవరితో అయినా నటించడానికి ఒకే అంటుంది కాజల్. ఇలాంటి పరిస్థుతులలో కాజల్ కు అనారోగ్యం చేసింది అంటే ఎవరూ నమ్మరు. 

దీనికి సంబంధించిన వార్తలు కూడ ఎప్పుడూ మీడియాలో రాలేదు. దీనితో కాజల్ స్వయంగా తన అనారోగ్యానికి సంబంధించిన విషయాన్ని స్వయంగా చెప్పడం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. ఈవారం విడుదల కాబోతున్న ‘కవచం’ మూవీ మీడియా మీట్ లో కాజల్ ఈ విషయాన్ని బయట పెట్టుకుంది.  

ఈ ఏడాది ప్రారంభంలో సుమారు మూడు నెలలు తనకు ఆరోగ్యం ఏమి బాగాలేదని అందువల్ల తాను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేస్తూ కొత్త సినిమాలను ఒప్పుకోకుండా జాగ్రత్తలు తీసుకున్న విషయాన్ని కాజల్ బయటపెట్టింది. తనకు వచ్చిన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ సమస్య నుండి తాను ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాను అంటూ తన సినిమాల స్పీడ్ వల్ల తనకు కలుగుతున్న శ్రమను తగ్గించాలని దేవుడు ఆవిధంగా బ్రేక్ వేసి ఉంటాడు అంటూ అభిప్రాయ పడుతోంది కాజల్. 

హఠాత్తుగా రోగనిరోధక శక్తి తగ్గిపోవడం ఊహించని విధంగా జ్వరం ఒళ్లు నొప్పులు వచ్చేయడం ఈ రోగ లక్షణం కాజల్ తనకు వచ్చిన ఈ అనారోగ్య సమస్యల లక్షణాలను బయటపెట్టింది. అంతేకాదు తనకు ఈ అనారోగ్యం ఎందుకు వచ్చిందో తనకు తెలియదు అంటూ డాక్టర్ల పర్యవేక్షణలో హెవీ డోస్ మందులు తీసుకావడంతో తనకు ప్రస్తుతం ఆరోగ్యం కుదుటపడినా భవిష్యత్ లో తాను చేయబోయే సినిమాల సంఖ్య బాగా తగ్గించుకుంటున్నాను అంటూ కాజల్ చెప్పడంతో మన సీనియర్ హీరోల హీరోయిన్స్ కష్టాలు మరింత పెరిగాయి అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: