విజయ్ దేవరకొండ.. ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనాలకు మారుపేరుగా నిలుస్తున్న హీరో. పట్టుమని పది సినిమాలు కూడా లేకుండానే అగ్ర హీరోల సరసన చేరిపోయాడు. పెళ్లిచూపులు సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన ఈ కుర్రాడు.. అర్జున్ రెడ్డితో తన స్టామినా ఏంటో చూపించి ఒక్కసారిగా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయ్యాడు. గీత గోవిందం బ్లాక్ బస్టర్ కావడంతో టాప్ హీరోల జాబితాలోకి మెల్లగా చేరిపోయాడు.

Image result for vijay devarakonda


ఇటీవల నోటా సినిమా విజయవంతం కాకపోయినా టాక్సీవాలాతో మరో హిట్ కొట్డాడు. అలాంటి విజయ్ దేవరకొండ ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఫోర్బ్స్ ఇండియా సెలబ్రెటీల జాబితాలో ర్యాంకు సంపాదించి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఈ జాబితాలో పవన్ 24 వ ర్యాంకు, ఎన్టీఆర్ 28 ర్యాంకు, మహేశ్ 33 ర్యాంకు దక్కించుకున్నారు. ఆ తర్వాత నాగార్జున 36 ర్యాంకు, అల్లు అర్జున్ 64 వ ర్యాంకు సాధించారు.

Image result for vijay devarakonda

వీరి తర్వాత విజయ్ దేవరకొండ.. రామ్ చరణ్‌ తో కలసి 72వ ర్యాంకు పంచుకోవడం విశేషం. రామ్ చరణ్, విజయ్ దేవరకొండ ఇద్దరూ ఏడాదికి 14 కోట్ల రూపాయల సంపాదనతో ఒకే ర్యాంకు పంచుకోవడం విశేషం. అతి తక్కువ కాలంలోనే ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించడం ద్వారా విజయ్ దేవరకొండ మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు. ఇటీవలే గీత గోవిందం సినిమా ద్వారా విజయ్ దేవరకొండ వంద కోట్ల క్లబ్బులోనూ చేరిపోయిన సంగతి తెలిసిందే. మరి విజయ్ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: