ఏవిషయం పై అయినా ఎటువంటి మొహమాటం లేకుండా తన మనసులోని అభిప్రాయాలను ముక్కు సూటిగా చెప్పే పోసాని కృష్ణమురళి ఈరోజు ఉదయం మొదలైన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఏర్పాట్ల ఫై తీవ్ర అసహనాన్ని వ్యక్తపరిచాడు. ఎల్లారెడ్డిగూడ పీజేఆర్ కమ్యూనిటీ హాల్‌ లో ఓటు హక్కును వినియోగించుకున్న పోసాని ఆతరువాత మీడియాతో మాట్లాడుతూ ఈవీఎంలు చీకట్లో పెట్టారని ఎవరికి ఓటు వేయాలో ఏ గుర్తు ఎక్కడ ఉందో సరిగా కనిపించడం లేదని అంటూ సంచలన కామెంట్స్ చేసాడు.

ఇది ఇలా ఉంటే ఈరోజు ఉదయం నుండి ప్రారంభం అయిన ఎన్నికల పోలిగింగ్ కు టాలీవుడ్ సెలెబ్రెటీలు కూడ క్యూ కట్టారు. ఓటు వేసేందుకు సినీ నటుడు అక్కినేని నాగార్జున అతని సతీమణి అమలలు వరుసలో నుంచుని జూబ్లీహిల్స్ బూత్ నెంబర్ 151లో వారు ఓటు వేయడంతో మీడియా కెమెరాలు అన్నీ నాగార్జున చుట్టూ తిరిగాయి.
Telangana assembly elections Live Updates: Voting for 119 seats today, counting Dec 11
తెలంగాణ ప్రజల భవిష్యత్ ను తేల్చే ఈ ఎన్నికలలో తప్పకుండా ఓటు వేయమని రాజమౌళి పరుచూరి గోపాలకృష్ణ లాంటి సినీ ప్రముఖులు ఎందరో పిలుపును ఇచ్చారు. వీరే కాకుండా చిరంజీవి వెంకటేష్ అల్లు అర్జున్ లాంటి చాలామంది హీరోలు ఓట్ల బూత్ ల ముందు కనిపించడం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. 

అయితే ఇప్పటి వరకు తన సోదరి నందమూరి సుహాసిని ప్రచారానికి దూరంగా ఉన్న జూనియర్ కళ్యాణ్ రామ్ లు కనీసం వారి ఓటును వినియోగించుకోవడానికి ఎప్పుడు వస్తారు అన్న ఆసక్తితో నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఎక్కడిక్కడ చాలామంది ప్రముఖులు ఓటింగ్ బూత్ వద్దకు వచ్చినా తమ పేర్లు ఆ ఓటర్ల లిస్టులో కనిపించకపోవడం చాలామందికి నిరాశను కలిస్తోంది. ఈ ఎన్నికలలో ఒక్క బాలకృష్ణ మినహా ఏ సెలెబ్రెటీ ఏపార్టీకి ప్రచారం చేయకుండా తాము అన్ని పార్టీలకు చెందినా వాళ్లము అంటూ సంకేతాలు ఇస్తున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: