‘ఉయ్యాల జంపాల’ మూవీ సక్సస్ తరువాత రాజ్ తరుణ్ ఇమేజ్ పెరిగి పోవడమే కాకుండా ఆతరువాత అతడి సినిమాలకు వరస సక్సస్ లు రావడంతో ఇండస్ట్రీ యంగ్ హీరోలలో రాజ్ తరుణ్ మంచి స్థానానికి చేరుకుంటాడని అందరూ ఆశించారు. అయితే ఆతరువాత ఈ యంగ్ హీరో తన అత్యుత్సాహంతో తన సినిమాల కథలు దర్శకుల విషయంలో రకరకాల ప్రయోగాలు చేసి వరస ఫ్లాప్ లను కొని తెచ్చుకోవడమే కాకుండా ప్రస్తుతం అతడి సినిమాలకు బయ్యర్లు లేని పరిస్థితి ఏర్పరుచుకున్నాడు.

ఇలాంటి పరిస్థుతులలో ఈ యంగ్ హీరో ఈ ఏడాది నటించిన ‘రంగులరాట్నం’ ‘రాజుగాడు’ ‘అవర్’ ఇలా మూడు సినిమాలు ఫెయిల్ అవ్వడంతో ప్రస్తుతం ఈ యంగ్ హీరో వైపు చూసే దర్శక నిర్మాతలు కరువైపోయారు. ఇలాంటి పరిస్థుతులలో రాజ్ తరుణ్ తన స్పీడ్ తగ్గించి ఒక మంచి కథ కోసం ఎదురు చూస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వర్జిన్ స్టేటస్ ఫై సంచలన వ్యాఖ్యలు చేసాడు.

ఇదే ఇంటర్వ్యూలో రాజ్ తరుణ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ తనకు వచ్చే ఏడాది పెళ్లి చేసుకునే ఆలోచన ఉందని అయితే తాను వర్జిన్ ను కాను అన్న విషయాన్ని ముందుగానే చెప్పి తాను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు కామెంట్స్ చేసాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతానికి తన దృష్టిలో ఎవరూ లేరని తనకు నచ్చే అమ్మాయి దొరుకుతుందో లేదో చూడాలి అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు. 

ఇక ఇదే సందర్భంలో తనకు హీరోయిన్ హెబ్బా పటేల్ కు ఉన్న సాన్నిహిత్యం గురించి మాట్లాడుతూ ఆమె తనకు ఒక మంచి స్నేహితురాలు మాత్రమే అంటూ కామెంట్స్ చేసాడు. తమ ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం గురించి వచ్చిన వార్తలు ఏవి నిజం కావు అని అంటూ ప్రస్తుతం తాము సినిమాలు వేగంగా చేయలేకపోతున్నా తాను చక్కగా తన పెంపుడు కుక్కలతో లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాను అంటూ చాల తెలివిగా తనను తాను కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు రాజ్ తరుణ్..  


మరింత సమాచారం తెలుసుకోండి: