బాలీవుడ్ స్టార్, హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మీద ఓ అమెరికా మేగజైన్ విషం కక్కింది. ప్రియాంక ఇటీవల అమెరికన్ నటుడు, సింగర్ నిక్ జొనాస్‌‌ను పెళ్లాడిన నేపథ్యంలో 'ది కట్' అనే మేగజైన్ సంచలన కథనం ప్రచురించింది. ఈ కథనం ప్రచురించిన కొన్ని గంటల తర్వాత తన వెబ్ సైట్ నుంచి సదరు మేగజైన్ దాన్ని తొలగించడం గమనార్హం. అయితే అప్పటికే ప్రియాంక మీద విషం చిమ్మిన సదరు కథనం ఇంటర్నేషనల్ వైడ్ వైరల్ అయింది. ఇక ఆ మ్యాగజైన్ కథనం మేరకు నిక్ జొనాస్ తనకు ‘ఇష్టం లేకున్నా ఒక మెసపూరిత సంబంధం'లోకి అడుగు పెట్టారంటూ ‘ది కట్ మేగజైన్' తన కథంలో పేర్కొంది.
newyork magazine apologizes to priyanka over defamative piece
  కొన్నాళ్లు ఎంజాయ్ చేయాలనుకున్న వీరు పెళ్లి వరకు వచ్చేలా ప్రియాంక చేసిందని ఆ మేగజైన్ విష ప్రచారం చేసింది. ప్రియాంక చోప్రా, నిక్ జొనాస్ మధ్య ఉన్నది ఫేక్ రిలేషన్‌షిప్ అంటూ ఆ కథనం సారాశం.అయితే ఇది రచయిత మారియా స్మిత్ ఈ ఆర్టికల్ రాశారు. అందులో అతడి జాత్యహంకరా ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని, ప్రియాంక చోప్రా మీద ఇలా విషం చిమ్మే ప్రయత్నం సహించరానిదంటూ అభిమానులు మండి పడుతున్నారు.  తాజాగా ప్రియాంక చోప్రాపై న్యూయార్క్ మ్యాగజైన్ దారుణమైన కథనాన్ని రాసి భారత్‌లో తీవ్రమైన వ్యతిరేకత ఎదురుకావడంతో ఉపసంహరించుకున్నది. ఈ తరహా పత్రికా కథనంపై బాలివుడ్‌కు చెందిన ప్రముఖులతోపాటుగా ఇతర రంగాలకు చెందినవారు కూడా నిరసన తెలిపారు.
రచయిత జాత్యంహంకార చర్య
ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేదని పేర్కొన్నారు. కొందరైతే భారతీయ వనిత అమెరికా గడ్డపై పేరు సంపాదించడం ఏమాత్రం ఇష్టం లేని జాత్యహంకారులు మాత్రమే ఇలాంటి వ్యాసాలు రాస్తారని మండిపడ్డారు.  మొత్తానికి   ఆ పత్రిక సదరు వివాదాస్పద వ్యాసానికి ముందుగా కొన్ని సవరణలు చేసింది.  తర్వాత తన సైటు నుంచి ఆ వ్యాసాన్ని మొత్తంగా తొలగించింది. అంతేకాకుండా ప్రియాంక చోప్రాకు, నిక్ జోనాస్‌కు, పాఠకులకు క్షమాపణలు చెప్పింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: