తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం కనిపిస్తున్న పరిస్థితులలో  పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నజనం మధ్య మెరుస్తున్న టాలీవుడ్ సెలిబ్రిటీలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.  మన హక్కులని కాపాడుకునేందుకు దేశాన్ని అభివృద్దిలో నడిపించేందుకు ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని సినీ సెలెబ్రిటీలంతా  మీడియాలో ప్రచారంచేస్తున్న విషయం తెలిసిందే. 
  ఏంటా గడ్డం
ఇలాంటి పరిస్థితులలో ఈరోజు ఓటు హక్కు వినియోగించుకున్న సెలిబ్రెటీలు అనేకమంది ఉన్నా అందరికంటే మీడియా కెమెరాలను  ఆకర్షించిన  జూనియర్ తో పాటు అతడి గెడ్డం కూడ హాట్ టాపిక్ గా మారింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కుటుంబ సమేతంగా జూబ్లీ హిల్స్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసాడు. ఎన్టీఆర్ తో పాటు సతీమణి లక్ష్మి ప్రణతి తల్లి షాలిని క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకోవడంతో ఆపోలింగ్ బూత్ బయట సందడి వాతావరణం చోటు చేసుకుంది.   
కుటుంబ సమేతంగా క్యూలో నిలబడి
ముఖ్యంగా ఓటు వేసిన తరువాత జూనియర్  మీడియాకు చేతివేలి ఉన్న సిరాను  చూపిస్తూ అభివాదంచేసిన దృశ్యాలను ఫోటోలు తీసుకోవడానికి మీడియా కెమేరాలు పోటీ పడ్డాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో నటిస్తున్న నేపధ్యంలో ఈమూవీలో జూనియర్ బందిపోటుగా నటిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.   
విభిన్నమైన పాత్రల్లో
స్వాతంత్ర పోరాట నేపథ్యంలో తీయబడుతున్న ఈమూవీలో జూనియర్ కొంతవరకు నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రను పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈమూవీ కోసం జూనియర్ భారీగా బరువు పెరుగుతున్నాడంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈరోజు ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద  సాధారణ బరువుతోనే కనిపించాడు. అయితే గడ్డం మాత్రం బాగా పెరిగి కనిపించడంతో ఆగడ్డం లుక్ ఈరోజు తెలంగాణా ఎన్నికల హాట్ టాపిక్ గా మారింది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: