‘భైరవగీత’ మూవీ ఇప్పటివరకు ఎన్నిసార్లు వాయిదా పడిందో రామ్ గోపాల్ వర్మకు కూడ గుర్తు ఉండి ఉండదు. దీనితో ఇండస్ట్రీ వర్గాలలో  మొదట్లో ఈ సినిమా పై వచ్చిన ఆసక్తి ఇప్పుడు నెమ్మదిగా తగ్గి పోయింది. అయితే  ‘భైరవగీత’ కన్నడలో మాత్రం  మొన్న 7వ తారీఖున  రిలీజ్ అయింది. 

అదేరోజు మన టాలీవుడ్ లో నాలుగు సినిమాలు మధ్య పోటీ ఉండటంతో పాటు తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో వర్మ తెలుగు వెర్షన్ ను వదిలే సాహసం చేయలేక పోయాడు. అయితే ఈమూవీకి కన్నడలో మాత్రం పాజిటివ్ టాక్ రావడం ప్రస్తుతం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. దీనికితోడు ఈమూవీకి కన్నడ మీడియా మంచి రేటింగ్స్ ఇచ్చింది.  

కొత్త దర్శకుడు సిద్ధార్ద్ టేకింగ్ కి మంచి మార్కులే పడ్డాయి.  అయితే ఈ మూవీలో మితిమీరిన వయోలెన్స్ తో పాటు వర్మ మార్కు యాక్షన్ ఎపిసోడ్స్ ఈమూవీకి  కొంతవరకు మైనస్ గామారిందని కన్నడ మీడియా అభిప్రాయ పడుతోంది. ప్రస్తుతం కన్నడ ప్రేక్షకులు హింసతో కూడుకున సినిమాలను బాగా ఆదరిస్తున్న నేపధ్యంలో ఈమూవీకి మంచి కలక్షన్స్ వస్తున్నాయని టాక్. ప్రస్తుతం కన్నడ ఫిలిం ఇండస్ట్రీ ట్రెండ్ ను గమనిస్తే గత కొన్నేళ్లలో వైలెన్స్ సబ్జెక్ట్ తో వచ్చిన సినిమాలు బాగా కలక్షన్స్ రాబడుతున్నాయి.   

దీనితో కన్నడంలో ‘భైరవగీత’  కొంతవరకు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి బ్యాక్ డ్రాప్ సినిమాలు మన తెలుగు రాష్ట్రాలకు కు సంబంధించిన బి సి సెంటర్లలలో బాగా ఆడుతున్న నేపధ్యంలో ఈవారం విడుదల కాబోతున్న ఈమూవీ ఇక్కడ కూడ విజయం సాధించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు కన్నడ పత్రికలు కన్నడ సోషల్ మీడియా ఈ మూవీకి 2.75 నుంచి 3 దాకా రేటింగ్స్ ఇవ్వడం అత్యంత ఆశ్చర్యంగా మారింది. ఇప్పుడు హడావిడి చేస్తున్న ఈ టాక్ మన తెలుగు రాష్ట్రాలలో కూడ ఈసినిమాకు  వస్తే మళ్ళీ రామ్ గోపాల్ వర్మ ట్రాక్ లోకి వచ్చినట్లే అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: