సౌత్‌ ఇండియా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి మాత్రమే కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ టాప్ సెలెబ్రెటీగా గత నాలుగు దశాబ్దాలుగా తమిళ ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేస్తున్న రజినీకాంత్ పుట్టినరోజు రేపటి రోజున జరగబోతోంది. 68వ సంవత్సరంలోకి రజినీకాంత్ అడుగుపెడుతూ ఉన్నా సినిమాల విషయంలో అతడి దూకుడు తగ్గడం లేదు. 

కేవలం తమిళనాడులో మాత్రమే కాకుండా అనేక దేశాలలో లక్షల సంఖ్యలో అభిమానులు కలిగి ఉన్న రజినీకాంత్ వ్యక్తిగత జీవితం గురించి అందరికీ చాల ఆసక్తి ఉంటుంది. ఇలాంటి పరిస్థుతులలో రజినీకాంత్ భార్య లత గురించి ఒక ప్రముఖ మీడియా సంస్థ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. లత రజినీకాంత్ లది ప్రేమ పెళ్లి. 1980 ప్రాంతంలో రజినీకాంత్ ‘తిల్లు మల్లు’ అనే చిత్ర షూటింగ్‌ లో పాల్గొంటున్నప్పుడు లతా రంగాచారి తన కాలేజీ మ్యాగ్జైన్‌ ఇంటర్వ్యూ కోసం రజినీకాంత్ నటిస్తున్న సినిమా షూటింగ్ స్పాట్ కు వచ్చింది. 

అయితే లతా రంగాచారిని చూడగానే రజినీ గుండెలలో ప్రేమ మొదలు కావడమే కాకుండా ఆ ఇంటర్వ్యూ పూర్తి అయ్యే లోపే ఆమె తీరు రజినీకాంత్ కు బాగా నచ్చడంతో తనను పెళ్లి చేసుకుంటావా అంటూ లతను అప్పట్లోనే రజినీకాంత్ సినిమా ఫక్కీ తీరులో అడిగినట్లు సమాచారం. ఈ అనుకోని ప్రశ్నకు షాక్ అయిన లత తనతో రజినీ జోక్ చేస్తున్నాడని అప్పట్లో భావించిందట. 

దీనితో రజినీ మాటలకు సూపర్ షాక్ తగిలిన లత నవ్వుతూ తన తల్లితండ్రులతో మాట్లాడమని రజినీ కాంత్ కు అప్పట్లో చెప్పిందని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని చాల సీరియస్ గా తీసుకున్న రజినీకాంత్ తన స్నేహితుడు, నటుడు అయిన వైజీ మహేంద్రన్‌ ను రంగంలోకి దింపి లత ఇంటికి పంపి తన ప్రేమ చిగురించిన ఏడాది లోపే ఫిబ్రవరి26, 1981 తిరుపతి వెంకన్న సమక్షంలో లతా రంగాచారి రజినీకాంత్ లు ఒక్కటయ్యారు. ఆ తరువాత లత రజినీకాంత్ నటించే సినిమాల విషయంలో పెద్దగా జోక్యం చేసుకోలేకపోయినా రజినీకాంత్ అలవాట్లను అదేవిధంగా రజినీకాంత్ తీరును మార్చడమే కాకుండా రజినీకాంత్ సూపర్ స్టార్ గా ఎదగడానికి పరోక్షంగా సహాయం చేసిన అజ్ఞాత శక్తిగా ఇప్పటికీ రజినీకాంత్ సన్నిహితులు లతా రంగాచారి సామర్ధ్యం గురించి చెపుతూనే ఉంటారు..    


మరింత సమాచారం తెలుసుకోండి: