మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ షూటింగ్ రకరకాల కారణాలతో వేగంగా నడవక పోవడమే కాకుండా ఈ మూవీకి సంబంధించిన గ్రాఫిక్ పనులలో మరింత జాప్యం జరిగే అవకాసం కనిపిస్తున్న నేపధ్యంలో ఈమూవీ వచ్చే ఏడాది సమ్మర్ కు విడుదలకావడం కుదరక పోవచ్చు అన్నవార్తలు ఇప్పటికే వచ్చాయి. సుమారు 200కోట్ల భారీ బడ్జెట్ లోతీస్తున్న ఈమూవీ బడ్జెట్ మరింత పెరిగినా ఆశ్చర్యంలేదు అని అంటున్నారు.
 శాసిస్తున్న సైరా
ఇలాంటి పరిస్థితులలో ఈమూవీ షూటింగ్ కు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ లీక్ కావడం చిరంజీవికి తీవ్ర అసహనం కలిగిస్తున్నట్లు టాక్. లేటెస్ట్ గా ఈమూవీలో కీలక పాత్ర చేస్తున్న విజయ్ సేతుపతి పాత్రకు సంబంధించిన ఫోటోలు లీక్ అయ్యాయి. వీటితో పాటు నరసింహా రెడ్డి గెటప్ లో ఉన్న చిరంజీవి రాజసం ఉట్టిపడేలా భారీ దుంగ పై కూర్చుని ఉన్న స్టిల్ ఇప్పుడు మెగా అభిమానులను విపరీతంగా ఆకరిశిస్తోంది. 
 విజయ్ సేతుపతి లుక్ లీక్
‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’ పాత్రలో నటిస్తున్న చిరంజీవి తన సైన్యానికి దిశా నిర్దేశం చేస్తూ శాసించే పోరాట నాయకుడిలా కనిపిస్తున్నాడు. ఈ గెటప్ చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకునే ఎమోషనల్ సన్నివేశాలు ఈమూవీలో చాల కనిపించబోతున్నాయి అంటూ మెగా అభిమానులు అప్పుడే కలలు కంటున్నారు.
నయనతార
దీనికితోడు తమిళ హీరో విజయ్ సేతుపతి గెటప్ కూడా లీక్ అయింది. విజయ్ సేతుపతి నుదుటిపై విభూది, మెడలో హారంతో యోగిలా కనిపిస్తున్నాడు.ఈ చిత్రంలో విజయ్ సేతుపతి సైరాకు రహస్య స్నేహితుడిగా ఉంటూ బ్రిటిష్ వారి సమాచారాన్ని చేరవేసే పాత్రలో నటిస్తునట్లు వార్తలు వస్తున్నాయి. ఈమూవీలో బాలీవుడ్ కోలీవుడ్ రంగాలకు చెందినా అనేక మంది ప్రముఖ నటీ నటులు నటిస్తున్న నేపధ్యంలో ఈమూవీని అన్ని భాషలలోను డబ్ చేసి మార్కెట్ చేయాలి అన్న చరణ్ ఆలోచనలకు తోడు ఈమూవీ ద్వారా కనీసం 500 కోట్ల కలక్షన్స్ టార్గెట్ ను ఫిక్స్ చేసుకున్న చిరంజీవి ఆశలు ఎంత వరకు ‘సైరా’ నెరవేర్చ గలుగుతుందో చూడాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: