మెగా బ్రదర్ నాగబాబు ఆవేశంతో అనాలోచితంగా బాలకృష్ణను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు వరుణ్ తేజ్ కి సమస్యగా మారబోతున్నాయి. వచ్చే వారం డిసెంబర్ 21న విడుదల కాబోతున్న వారుణ్ తేజ్ ‘అంతరిక్షం’ మూవీకి తాము సమస్యలు సృష్టించబోతున్నాము అంటూ బాలయ్య అభిమానులు ఇస్తున్న లీకులు ప్రస్తుతం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. 

రెండు రోజుల క్రితం నాగబాబు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్య పై వేసిన తీవ్రమైన సెటైర్లకు ప్రతిస్పందనగా బాలకృష్ణ అభిమానులు ఎవరూ ఊహించని షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు. వచ్చే వారం విడుదలకాబోతున్న వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’ మూవీని ధియేటర్లలో విడుదల కాకుండా అడ్డుకుంటామని ఒకవేళ ఆమూవీ ధియేటర్లలో ప్రదర్శింపబడినా ఆమూవీ మొదటిరోజు మొదటి షో నుండి నెగిటివ్ టాక్ ను ప్రచారంలోకి తీసుకువస్తామని అంటూ బాలయ్య అభిమానులు నాగబాబుకు ఇచ్చిన హెచ్చరికలు సంచలనంగా మారాయి.

దీనితో బాలయ్య అభిమానులు గతంలో జూనియర్ సినిమాలకు నెగిటివ్ టాక్ ను ప్రచారం చేసిన విధంగా వరుణ్ తేజ్ సినిమాలకు కూడ అదే పద్ధతిని అనుసరించబోతున్నారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. డైరక్టర్ సంకల్ప రెడ్డి వరుణ్ తేజ్ తో తీసిన ‘అంతరిక్షం’ మూవీ క్లాస్ ప్రేక్షకులకు అదేవిధంగా యూత్ కు బాగా కనెక్ట్ అయినా మాస్ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాదు అన్న ప్రచారం ఇప్పటికే జరుగుతోంది.

దీనితో బాలయ్య అభిమానులు చేపెట్టబోయే నెగిటివ్ ప్రచారం వల్ల ‘అంతరిక్షం’ కలక్షన్స్ కు ఎంతోకొంత నష్టం జరుగుతుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో అనాలోచితంగా నాగబాబు చేసిన కామెంట్స్ వరుణ్ తేజ్ కు ఊహించని శాపంగా మారుతాయ అన్న కోణంలో ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి..   



మరింత సమాచారం తెలుసుకోండి: