ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భారీ చిత్రాలకు గ్రాఫిక్స్ ప్రధాన అంశంగా మారిపోయింది.   అలాంటిభారీ చిత్రాలకు  విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ గా ఇండస్ట్రీ వర్గాలలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు శ్రీనివాస్ మోహన్. ‘బాహుబలి’ ‘2.0’ లాంటి భారీ చిత్రాలకు శ్రీనివాస్ మోహన్ విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ గా పనిచేసి ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు. 
వామ్మో 'ఆర్ఆర్ఆర్' గురించా
‘రోబో’ బాహుబలి 1 చిత్రాలకు శ్రీనివాస్ మోహన్ చూపెట్టిన ప్రతిభకు బెస్ట్ విఎఫ్ఎక్స్ విభాగంలో జాతీయ అవార్డు కూడ వచ్చింది. ఇలాంటి పరిస్థితులలో శ్రీనివాస్ మోహన్  రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ ఆర్ ఆర్’ కు  విఎఫ్ఎక్స్ అందిస్తున్నాడు. బాహుబలి1 చిత్రంతో జాతీయ అవార్డు సొంతం చేసుకున్న శ్రీనివాస్ మోహన్ ‘బాహుబలి2’ కి పనిచేయలేదు దీనికికారణం శంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిచిన ‘2.0’ చిత్రం బిజీ షెడ్యూల్. ‘బాహుబలి’ చిత్రాన్ని తెరకెక్కించాలనే ఆలోచనని రాజమౌళి చెప్పినప్పుడు చాలా భారీ ప్రాజెక్ట్ అనిపించిందని అయితే  ఆసమయంలో రాజమౌళికి రెండు భాగాలుగా తెరకెక్కించాలనే ఆలోచనలేక పోవడంతో  ఏడాదిన్నరలోపే ఈచిత్రాన్ని ఫినిష్  చేస్తాడు అనుకుని బాహుబలి 1కు పనిచేసిన విషయాన్ని బయటపెట్టాడు. 
ఆర్ఆర్ఆర్ అలాంటి చిత్రం కాదు
అయితే ‘బాహుబలి’ కంటే ముందే ‘2.0’ చిత్రానికి పనిచేస్తానని శంకర్ కి మాట ఇవ్వడంతో తానూ ‘బాహుబలి 2’ కు పనిచేయలేక పోయిన విషయాన్ని వివరించాడు శ్రీనివాస్ మోహన్. ఇదే సందర్భంలో ప్రస్తుతం తాను పనిచేస్తున్న రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం గురించి మాట్లాడుతూ   ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ అందరు అనుకునే విధంగా విజువల్ ఎఫెక్ట్స్ చిత్రంకాదని ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో కధకు విపరీతమైన ప్రాధాన్యత ఉన్న విషయాన్ని వివరించాడు. 
బాహుబలి 2 చేయకపోవడానికి
అయితే ఈమీడియా ఇంటర్వ్యూ నిర్వహిస్తున్న మీడియా ప్రతినిధి ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఇంకేమైనా విశేషాలు చెప్పగలరా అని ప్రశ్నించినప్పుడు శ్రీనివాస్ మోహన్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘ఆర్ ఆర్ ఆర్’ గురించి రాజమౌళి ఒక్కమాట కూడా మీడియాతో మాట్లాడవద్దని చెప్పాడని ఆ చిత్రం గురించి రాజమౌళి తప్ప ఇంకెవరూ మాట్లాడే అవకాశమేలేదని అంటూ ఈమూవీ ప్రాజెక్ట్ గురించి ఎవరు మాట్లాడినా వెంటనే రాజమౌళి ఆగ్రహానికి గురవుతారు అంటూ చేసిన కామెంట్స్ బట్టి రాజమౌళి ఒకసారి సినిమా మొదలుపెడితే ఎంత నియంతృత్వ ధోరణిలో ఉంటాడో అర్ధం అవుతుంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: