విజయ్ దేవరకొండ.. ఇప్పుడు టాలీవుడ్ ను ఊపేస్తున్న యువకెరటం. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ కొత్త స్టార్ కు అపజయాలు ఉన్నా.. అవి అంతగా ప్రభావం చూపించడం లేదు. ఇటీవలే వచ్చిన టాక్సీవాలా హిట్ టాక్ తెచ్చుకోవడంతో అంతకు ముందు డిజప్పాయింట్ చేసిన నోటా ఎఫెక్ట్ కాస్త తగ్గింది.

Related image


ఇప్పుడు వరుస సినిమాలతో విజయ్ దేవరకొండ బిజీగా ఉన్నాడు. అంతకుముందులా కొత్త దర్శకులకు అవకాశాలిచ్చే పరిస్థితి లేదు. సెలెక్టివ్ కథలతో వచ్చిన స్టార్ డమ్ ను నిలబెట్టుకునేందుకు విజయ్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

Image result for vijay devarakonda nota


ఐతే.. ఇటీవల తమిళ, తెలుగు భాషల్లో భారీ అంచనాలతో వచ్చిన నోటా చిత్రం నిరాశపరిచినా.. విజయ్ మరోసారి తమిళ చిత్రం చేసే అవకాశాలున్నాయట. ఎస్‌.ఆర్‌. ప్రభు అనే తమిళ నిర్మాత విజయ్ తో సినిమా తీసేందుకు ఉత్సాహంగా ఉన్నాడట. ఈ మేరకు విజయ్‌ను సంప్రదించాడట.

Image result for vijay devarakonda

తమిళంలో మరో సినిమాకు విజయ్ దేవర కొండ కూడా సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోందిఅక్కడ కూడా విజయం సాధిస్తే.. సౌత్ ఇండియా స్టార్ గా తన పరిధి మరింత విస్తృతం అవుతుంది. ఐతే ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టుకు ఉండటం వల్ల.. కొత్త తమిళ సినిమా పట్టాలెక్కేందుకు కాస్త సమయం తీసుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: