2019 రాకుండానే 9 నెలల ముందు ఆగష్టు 15 రిలీజ్ డేట్ ను ఖరార్ చేస్తూ ‘సాహో’ కోసం ప్రభాస్ తీసుకున్న నిర్ణయం వెనుక చాల ముందస్తు హెచ్చరికలు ఉన్నాయి అన్న కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్నాయి. ఇంత ముందుగా ఈమూవీ రిలీజ్ డేట్ ప్రకటన వెనుక బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ సలహాలు ఉన్నట్లు సమాచారం. 
కలిసొచ్చే హాలిడే వీకెండ్
‘సాహో’ ను సుమారు 250 కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్న నేపధ్యంలో ఈమూవీకి అనుకున్న రీతిలో బాలీవుడ్ లో మార్కట్ జరగాలి అంటే బాలీవుడ్ ఇండస్ట్రీ సాంప్రదాయం ప్రకారం రిలీజ్ డేట్ క్లారిటీ చాల ముందుగా ఉండాలి అన్న విషయాన్ని స్పష్టంగా కరణ్ జోహార్ ప్రభాస్ కు చెప్పినట్లు టాక్. ఈమధ్య కరణ్ జోహార్ నిర్వహిస్తున్న బుల్లితెర షోకు ప్రభాస్ అతిధిగా వెళ్ళినప్పుడు వారిద్దరి మధ్యా ‘సాహో’ కు సంబంధించి జరిగిన చర్చలలో కరణ్ జోహార్ ఈ సూచన ఇచ్చినట్లు టాక్.
మూడు భాషల్లో ఇండియాలో ఇదే తొలిసారి
దీనికితోడు ఇంతముందుగా ‘సాహో’ రిలీజ్ డేట్ ను ప్రకటించడంతో ఈమూవీకి పోటీగా అటు బాలీవుడ్ లో కానీ ఇటు టాలీవుడ్ లో కానీ ఏభారీ సినిమా ‘సాహో’ తో పోటీకి రాకుండా ఈ వ్యూహాలను అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆగష్టు 15 రిలీజ్ డేట్ పై చిరంజీవి ‘సైరా’  కన్ను ఉన్నా ముందుగా ప్రభాస్ ప్రకటన రావడంతో ఇక ఎట్టి పరిస్తుతులలోను ‘సైరా’ 2020’ సంక్రాంతికి మాత్రమే రావలసిన పరిస్థితి ఏర్పడింది. 

దీనికితోడు గతంలో ఆగష్టు 15న విడుదలైన చాల భారీ సినిమాలు సూపర్ హిట్ అయిన సెంటిమెంట్ కూడ ‘సాహో’ రిలీజ్ డేట్ ను ప్రభావితం చేసింది అని అంటున్నారు. ఈసినిమాకు సంబంధించి అత్యధిక స్థాయిలో బిజినెస్ చేయాలి అన్న ఉద్దేశ్యం ‘సాహో’ నిర్మాతలకు ఉన్న పరిస్థుతులలో ఒక స్థిరమైన రిలీజ్ డేట్ ను ఖరార్ చేసుకుని ఆపై బయ్యర్లతో బిజినెస్ డీల్స్ కు దిగితే ‘సాహో’ నిర్మాతలు చెప్పే మాటలకు మంచి విలువ ఏర్పడుతుంది అన్న ఉద్దేశాలతో ప్రభాస్ ఇస్తున్న ఈ ముందస్తు హెచ్చరికలు అంటూ విశ్లేషకులు ఈమూవీ రిలీజ్ డేట్ వెనుక ఉన్న ఆంతర్యాన్ని వివరిస్తున్నారు..    


మరింత సమాచారం తెలుసుకోండి: