బాహుబలి హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్క ప్రేమలో ఉన్నారా.. ఇది ఎప్పటి నుంచో వినిపిస్తున్న వార్త. అమరేంద్ర,దేవసేనలు ప్రేమలో ఉన్నారని బాహుబలి కాలం నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికీ దీనిపై క్లారిటీ లేదు. ఎవరికి వారు లేదలేదంటూనే తప్పించుకుంటున్నారు.

Image result for prabhas and anushka


తాజాగా ఓ చిత్రంలో ప్రభాస్, అనుష్క కలిసి నటించేందుకు అంగీకరించారని కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో మరోసారి ఈ టాక్ బయలుదేరింది. ఈ గుసగుసలపై ప్రభాస్ ఎట్టకేలకు నోరువిప్పాడు. బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ నిర్వహించే టాక్ షోలో పాల్గొన్న ప్రభాస్ అక్కడ అనుష్క తో సంబంధం గురించి అడిగిన ప్రశ్నలకు బదులిచ్చాడు.

Related image


నువ్వు దేవసేనతో డేట్ లో ఉన్నావని వార్తలు వస్తున్నాయి నిజమేనా అని కరణ్ జోహార్ ప్రభాస్ ను సూటిగానే అడిగేశాడు. దీనిపై స్పందించిన ప్రభాస్ అలాంటిదేమీ లేదని చెప్పేశాడట. మరి గుసగుసలు బాగానే వినిపిస్తున్నాయి కదా.. అని కరణ్ జోహార్ అంటే..అది ప్రారంభించింది మీరేగా అంటూ ప్రభాస్ కౌంటర్ ఇచ్చాడట.

Image result for prabhas and anushka


సో.. ప్రభాస్ చెప్పేదాన్ని బట్టి చూస్తే అనుష్కతో డేటింగ్ లాంటిదేమీ లేదన్నమాట. అయితే ఇదే ఇంటర్వ్యూలో నువ్వు నాకు అబద్దాలు చెప్పావు కదా అని కరణ్ జోహార్ అడగటం.. దానికి ప్రబాస్ అవును అని సమాధానం చెప్పడం చూస్తుంటే.. సంథింగ్.. సంథింగ్.. అని చూసేవారికి అనిపిస్తోంది. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి.. ప్రభాస్, అనుష్క మధ్య ఎలాంటి సంబంధం ఉందో..


మరింత సమాచారం తెలుసుకోండి: