ఈ మద్య కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుసగా బయోపిక్ చిత్రాలు వస్తున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే సినీ నేపథ్యంలో తెలుగు లో మహానటి, బాలీవుడ్ లో సంజు చిత్రాలు వచ్చాయి.  ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం షూటింగ్ కూడా పూర్తి కావొచ్చింది.  ఇక రాజకీయ నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ‘యాత్ర’, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ లు కూడా రాబోతున్నాయి. 

తాజాగా కంగనా రనౌత్ ప్రధాన పాత్రధారిగా 'మణికర్ణిక' చిత్రం రూపొందింది. ఝాన్సీ లక్ష్మీబాయి జీవితచరిత్ర ఆధారంగా ఈ చిత్రం నిర్మితమైంది.  వాస్తవానికి ఈ చిత్రానికి మొదట క్రిష్ దర్శకత్వం వహించారు...కానీ ఎన్టీఆర్ బయోపిక్ బాధ్యతలు చేపట్టిన తర్వాత  'మణికర్ణిక' ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో, మిగిలిన భాగానికి కంగనానే దర్శకత్వ బాధ్యతను వహించింది.

తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఝాన్సీ లక్ష్మీ భాయి అసలు పేరు ‘మణికర్ణిక’. ఈ టైటిల్‌తోనే ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్స్‌తో పాటు ఈ మూవీ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ఝాన్సీ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని చూస్తోన్న బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఝాన్సీ లక్ష్మీబాయి చేసిన వీరోచిత పోరాటమే ‘మణికర్ణిక’ మూవీ. 

యుద్ధ విద్యలో ఝాన్సీ లక్ష్మీబాయి ఆరితేరడం, గుర్రపుస్వారిలో నైపుణ్యాన్ని కనబరచడం, వివాహం, ఆంగ్లేయ సైన్యంపై విరుచుకు పడటం,భర్తను కోల్పోవడం వంటి ఘట్టాలకి సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు.  కంగనా ఈ పాత్రలో ఎంతగా ఒదిగిపోయిందనేది ఈ ట్రైలర్ ను చూస్తే తెలుస్తోంది. ఈ మూవీని జీ స్టూడియోతో కలిసి కమల్ జైన్ తెరకెక్కించారు.

ఈ మూవీ డైరెక్షన్ క్రెడిట్స్‌లో క్రిష్‌తో పాటు కంగాన పేరు ఉండటం విశేషం. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత కథతో తెరకెక్కిన ‘మణికర్ణిక’ మూవీని వచ్చే యేడాది రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న  హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో  విడుదల చేయనున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: