తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది లక్కీ హీరోలు ఉన్నారు. వారిలో ఈ మద్య వరుస విజయాలు అందుకుంటున్న విజయ్ దేవరకొండ ఒకరు.  పెళ్లిచూపులు చిత్రం తర్వాత అర్జున్ రెడ్డి, గీతాగోవిందం, టాక్సీవాలా లాంటి చిత్రాలతో వరుస విజయాలు అందుకున్నాడు.  గీతాగోవిందం చిత్రంతో ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరాడు ఈ యూత్ హీరో. రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్‌లో ‘టాక్సీవాలా’ చిత్రం ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా..కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యం అయ్యింది.  మొత్తానికి బాలారిష్టాలను అధిగమించి ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన ఫలితాలను సాధించింది. 
Image result for taxiwala stills
ఈ చిత్రానికి ముందు విజయ్ దేవరకొండ నటించిన ‘నోటా’అట్టర్ ఫ్లాప్ కావడంతో టాక్సీవాలాపై ఎన్నో సందేహాలు వచ్చాయి. ఇంతలో ఈ చిత్రం లీక్ కావడంతో.. నిర్మాతలు షాక్ అయ్యారు.  కొన్ని మార్పులు చేర్పులు చేసి.. సినిమాను నవంబర్ 17 వ తేదీన రిలీజ్ చేశారు.  రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో హిట్ టాక్ రావడంతో కలెక్షన్లు కూడా భారీగానే వచ్చాయి.
Image result for taxiwala stills
ఈ చిత్రం పూర్తి చేయడానికి నిర్మాతలకు రూ.5 కోట్లు ఖర్చు అయింది.  ‘టాక్సీవాలా’ చిత్రం హిట్ టాక్ రావడంతో లాంగ్ రన్ లో  ఏకంగా రూ.50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసింది. మొత్తంగా ఈ మూవీ రూ.21.28 కోట్ల షేర్ సాధంచిందని ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి.  ఒక్క నైజాంలోనే రూ.7.70 కోట్ల షేర్ సాధించిన ‘టాక్సీవాలా’ మూవీ..ఓవర్సీస్‌లో రూ.3 కోట్ల షేర్ రాబట్టినట్టు సమాచారం. నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు కూడా లాభపడ్డారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: