నిన్నరాత్రి  హైదరాబాద్ లో జరిగిన ‘అంతరిక్షం’ ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా వచ్చిన రామ్ చరణ్ ఒకవైపు వరుణ్ తేజ్  పై విపరీతమైన ప్రశంసలు కురిపిస్తూనే మరోవైపు వరుణ్ తేజ్ పై తనకు రోజురోజుకు పెరిగిపోతున్న జెలసీని బయటపెట్టి అందరికి షాక్ ఇచ్చాడు.  తన తమ్ముడు వరుణ్ తేజ్ ఎప్పుడూ సర్ ప్రైజ్ చేస్తూనే వచ్చాడు అని అంటూ అలాంటి పరిస్థితులలో తనకు చాలాసార్లు ఆనందం కలగడమే కాకుండా అనేకసార్లు అసూయ కూడ కలిగింది అంటూ జోక్ చేసాడు.
వరుణ్ పిలిచాడని కాదు...
వరుణ్ తేజ్ సినిమా కథల ఎంపిక గురించి మాట్లాడుతూ అదృష్టం ఉంటే తప్ప ఇలాంటి అవకాశాలు అందరికీరావు అంటూ సినిమా కథల ఎంపికలో వరుణ్ తేజ్ తెలివి తేటలు డెడికేషన్ తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయాన్ని వివరించాడు. తన తమ్ముడు వరుణ్ పై చరణ్ మరింత ప్రశంసలు కురిపిస్తూ గొప్ప ఆలోచనలు వల్ల సకెస్స్ వస్తుందని  పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నవారికి మంచే జరుగుతుందని అటువంటి అదృష్టం వరుణ్ సొంతం అంటూ ప్రశంసలు కురిపిస్తూ ఉద్వేగంగా మాట్లాడాడు మెగా పవర్ స్టార్. 
ఆయన కటౌట్ ఇంతే... కానీ విజన్ గొప్పగా ఉంది
ఇదే ఫంక్షన్ లో రామ్ చరణ్ దర్శకుడు సంకల్ప రెడ్డి పై చేసిన కామెంట్స్ అందరికీ నవ్వు తెప్పించాయి. సంకల్ప రెడ్డి  సైజ్ కి ఆయన విజన్ కి సంబంధం లేదు అంటూ సంకల్ప్ ని తెగపొగిడాడు చరణ్. సినిమారంగంలో కాని రాజకీయాలలో కాని రాణించాలి అంటే గొప్ప ఆలోచనలు కావాలని అలాంటి  గొప్ప ఆలోచనలు ఉన్న రాజమౌళి  సుకుమార్ క్రిష్ ల లిస్టులో సంకల్ప రెడ్డి స్థానం పొందుతాడు అంటూ చరణ్ నోటివెంట వచ్చిన విపరీతమైన పొగడ్తలతో ‘అంతరిక్షం ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో హోరెత్తి పోయింది.  
 బాబాయ్ చెప్పిన మాట గుండెల్లోకి దూసుకెళ్లింది
చరణ్ మాట్లాడుతున్నప్పుడు అడ్డు తగిలిన పవన్ అభిమానులకు నచ్చే విధంగా చరణ్ కామెంట్స్ చేస్తూ  పవన్ కల్యాణ్ ఆలోచనల్ని  ఆశయాల్నితెగ పొగిడాడు. కొద్దిరోజుల క్రితం పవన్ అమెరికాలో అక్కడి ఎన్ఆర్ఐ లను ఉద్దేసించి చేసిన ప్రసంగంలోని మాటలు తన    గుండెల్లోకి దూసుకెళ్లిపోయాయి అంటూ పవన్ అభిమానులను కూడా వ్యూహాత్మకంగా ప్రసన్నం చేసుకున్నాడు. ప్రతిరోజూ భయంతో మన ఆలోచనలను ఆపివేయడం కంటే ఆ ఆలోచనలతో  ఒక పనిచేసి విజయం సాధించాలని అంటూ పవన్ చేసిన కామెంట్స్ తనను విపరీతంగా ప్రభావితం చేసిన విషయాన్ని బయటపెట్టాడు చరణ్. ఇలా ఒక విధంగా పవన్ పై చరణ్ ప్రేమను వ్యక్త పరిచే వేదికగా ‘అంతరిక్షం’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కొనసాగింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: