ఈ మద్య చాలా వరకు హర్రర్, కామెడీ, థ్రిల్లర్ కాన్సెప్ట్ తో చిత్రాలు మంచి విజయాన్ని అందుకుంటున్నారు.  ఎప్పుడూ మూస చిత్రాలు చూస్తున్న ప్రేక్షకులు ఈ తరహా చిత్రాలకు బాగానే ప్రాధాన్యత ఇస్తున్నారు.  తెలుగు సినీ ప్రేక్షకులకు బాలీవుడ్ హీరో సచిన్ సుపరిచితమే.  తెలుగు ఇండస్ట్రీలో సచిన్ చిత్రాలు ఇప్పటి వరకు ఎన్నో వచ్చాయి..కానీ ఏ ఒక్కటీ హిట్ కాలేదు. 

ప్రస్తుతం బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన సచిన్ తాజాగా ‘అమావాస్’ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.  ఈ మూవీలో స‌చిన్‌జోషి,న‌ర్గీస్‌ఫ‌క్రీ,న‌వ‌నీత్ కౌర్ దిలాన్‌,వివాన్ భాతేనా,అలీ అస్గ‌ర్‌,మోనా సింగ్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.  ఆ మద్య ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్...టీజర్ వచ్చింది.  తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. 

ఓ పురాతన బంగ్లాలో హీరో హీరోయిన్ లు ఎంట్రీ కావడంతో కథ మొదలవుతుంది..అక్కడ జరిగే సన్నివేశాలు చూస్తుంటే ఒళ్లు గగుర్బొడిచే ఉన్నాయి.  మన కంటికి కనిపించేదంతా నిజం కాదు..అమావాస్య చికట్లో దెయ్యాలు మేల్కొంటాయని..తామ కోరిక తీర్చుకుంటాయని..అలాంటి బంగ్లాకు రావడం తప్పని ఓ మాంత్రికురాలు చెప్పడం హీరో  ఆ దెయ్యాన్ని ఎలా ఎదుర్కొన్నాడు అన్న కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కించినట్లు కనిపిస్తుంది.  మొత్తానికి ఈ ట్రైలర్ చూస్తుంటే మాత్రం ప్రేక్షకులు చాలా థ్రిల్ పొందేలా అనిపిస్తుంది. ఈ చిత్రానికి   భూష‌న్‌ప‌టేల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: