‘బాహుబలి’ తో నేషనల్ సెలిబ్రిటీస్థాయికి ఎదిగిపోయిన ప్రభాస్ పేరు ఇప్పటివరకు ఏవివాదాలలోను వినిపించ లేదు. స్వతహాగా చాల మొహమాటస్తుడుగా పేరు గాంచిన ప్రభాస్‌ ఎవరితోనూ పెద్దగా కలవడానికి ఇష్టపడడు. అదేవిధంగా మీడియాను కూడ చాల దూరంగా ఉంచుతాడు. ఇలాంటి పరిస్థుతులలో ప్రభాస్ మోసపోయాడా లేక మోసం చేసాడా అంటూ మీడియాలో జరుగుతున్న ప్రచారం పై ప్రభాస్ తీవ్రంగా కలత చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ముఖ్యంగా ఈ వ్యవహారానికి సంబంధించిన వార్తలు తెలుగు మీదియాలోనే కాకుండా జాతీయ మీడియాలో కూడ రావడం ప్రభాస్ కు షాక్ కు గురిచేసినట్లు టాక్. ప్రభాస్ సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం మేరకు ఈ గెస్ట్ హౌస్ ల్యాండ్ విషయంలో వివాదాలు ఉన్నాయని ప్రభాస్ కు తెలియదు అనీ కొందరు ప్రభాస్ ను ఈ వ్యవహారంలో తప్పు దారి పట్టించి కొనుగోలు చేసేలా చేసారు అంటూ మీడియాకు లీకులు ఇస్తున్నారు. 

వాస్తవానికి ఈవిషయంలో ఎటువంటి రాజకీయాలు లేవనీ కేవలం ఈస్థల వివాదం పై సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన తీర్పును అమలు పరుస్తూ ప్రభాస్ గెస్ట్ హౌస్ ను స్వాధీనం చేసుకున్నామని అధికారులు చెపుతున్నారు. అయితే హైదరాబాద్ నగరంలో ఫిలిం నగర్ కు అతి సమీపంలో ఉన్న అత్యంత విలువైన ఈ గెస్ట్ హౌస్ ను వదులుకునే ఉద్దేశ్యంలో ప్రభాస్ లేనట్లు వార్తలు వస్తున్నాయి. 

దీనికోసం ప్రభాస్ ఒక ప్రముఖ లాయర్ సహకారంతో తరిగి హైకోర్ట్ మెట్లు ఎక్కినా నేపధ్యంలో ఈ వ్యవహారం పై కోర్ట్ ఎలా స్పందిస్తుంది అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి సుప్రీం కోర్ట్ చేసిన నిర్ణయాల పై మరి ఏన్యాయస్థానం జోక్యం చేసుకోదు. ఇలాంటి పరిస్థుతులలో ఈరోజు హైకోర్ట్ ప్రభాస్ గెస్ట్ హౌస్ విషయంలో ఎటువంటి నిర్ణయం వ్యక్త పరుస్తుంది అన్న ఆతృత అందరిలోనూ ఉంది. వాస్తవానికి తెలిసి చేసినా తెలియక చేసినా ఒక తప్పును చట్టం అంగీకరించదు కాబట్టి ప్రభాస్ విషయంలో కూడ సామాన్యుడుకి వర్తించే రీతిలోనే న్యాయస్థానాలు ప్రభాస్ వ్యవహారం పై తీర్పు ఇస్తాయా లేదంటే అతడి సెలెబ్రెటీ స్టేటస్ ను గుర్తిస్తాయా అన్న విషయం ఈరోజు క్లారిటీ వస్తుంది..    


మరింత సమాచారం తెలుసుకోండి: