ఆ చిన్నది హార్ట్ ఎటాక్ సినిమాతో పరిచయమైంది. ఆ సినిమా కాస్తో కూస్తో పేరు తెచ్చుకుంది.ఆ తర్వాత చిన్నా చితకా వేషాలు వచ్చినా అంతగా సక్సస్ ఆ అమ్మడిని కరుణించలేదు. ఆ తర్వాత కొన్నాళ్లూ బాలీవుడ్ కు చెక్కేసింది.



అక్కడా అంతగా అవకాశాలు కలిసి రాలేదు. ప్రస్తుతం చిన్నా చితకా వేషాలేస్తూ.. బ్రేక్ కోసం ప్రయత్నిస్తోంది. అప్పుడప్పుడు ఫ్యాషన్‌ షోల్లోనూ.. పార్టీల్లోనూ కనువిందు చేస్తోంది.



అందుకే అందాల ఆరబోతతో అందరి కళ్లలో పడే ప్రయత్నం చేస్తోంది. తాజాగా గోల్డెన్ రోజ్‌ అవార్ట్స్ ఫంక్షన్లో ఏకంగా ఎద అందాలు ఆరబోసింది. గతంలో కాజల్ వంటి కొందరు వేసిన ఓపెన్ హార్ట్ మోడల్ డ్రస్సుతో కలకలం రేపింది.



ఆదాశర్మ బోల్డ్ డ్రస్‌ చూసి ఫ్యాషన్‌ షోకు వచ్చినవారు అవాక్కయ్యారట. మరి చూడాలి ఈ బోల్డ్ ఫ్యాషన్ షో ఎంతవరకూ అవకాశాలు తెస్తుందో.. ప్రస్తుతం ఈ పిక్స్ మాత్రం నెట్‌లో తెగ చక్కర్లు కొట్టేస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: