ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో యువ దర్శకులు తమ సత్తా చాటుతున్నారు. కొత్త కొత్త కాన్సెప్ట్ ఉన్న చిత్రాలు తీస్తూ ప్రేక్షకులచే షభాష్ అనిపించుకుంటున్నారు.  తాజాగా యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటిస్తున్న ‘అంతరిక్షం’ చిత్రం రేపు విడుదల కాబోతుంది.  ఈ చిత్రంలో వరుణ్ సరసన అతిధి రావు, లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు.  ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. 

ఇక ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా గ్రాండ్ గా జరిగింది.  ముఖ్య అతిథిగా రాంచరణ్ వెళ్లడంతో చిత్ర యూనిట్ సంతోషంలో మునిగిపోయారు.  తెలుగులో తొలిసారిగా 'అంతరిక్షం' నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి.  అంతరిక్షానికి సంబంధించి అంతసేపు ఏం చూపిస్తారు? అనే సందేహం సామాన్య ప్రేక్షకులకు కలగడం సహజం. అసలు ఈ సినిమా ఏయే అంశాలను టచ్ చేస్తూ వెళుతుంది? తాము ఆశించేవి ఈ తరహా సినిమాలో వుంటాయా? అన్న అంశాలపై ప్రేక్షకులకు పలు రకాల అనుమానాలు ఉన్నాయి.

అయితే ఈ అనుమానాలు నివృతి చేయడానికి చిత్ర యూనిట్  వెరైటీగా ఓ వీడియోని వదిలారు. ఈ సినిమాలో ఏయే అంశాలు చోటుచేసుకున్నది ఈ వీడియో ద్వారా తెలియజేశారు. ప్రమోషన్స్ లో భాగంగా ఈ తరహా వీడియోతో ఈ సినిమా టీమ్ ప్రయోగాత్మక ప్రయత్నమే చేసింది. ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించడానికి చేసిన ఈ ప్రయత్నం బాగుందనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: