ఈమధ్యనే అమెరికా వెళ్లి అక్కడ ప్రవాస ఆంధ్రులతో అనేక సమావేశాలు నిర్వహించి ‘జనసేన’ సిద్దాంతాలను పరిచయం చేసిన పవన్ ఇప్పుడు ఒక మతపరమైన కార్యక్రమం కోసం యూరప్ వెళ్ళినట్లుగా వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తనకు కులాలు మతాల పై పట్టింపులు లేవు అంటూ అనేకసార్లు ఉపన్యాసాలు ఇస్తూనే ఉంటాడు. 
Telugu,film,star
అటువంటి పవన్ ఇప్పుడు తన కొడుకు కోసం ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొనబోతున్నాడు. తెలుస్తున్న సమాచారం మేరకు పవన్ తన భార్య అన్నాతో కలిసి తన రెండవ కొడుకు శంకర పవనో విచ్ కోసం యూరప్ లో క్రిష్టియన్ మతాచారాల ప్రకారం చేయవలసిన ఒక క్రైస్తవ మతానికి చెందిన ఒక కార్యక్రమం నిర్వహించడానికి యూరప్ వెళ్ళినట్లు తెలుస్తోంది. 
Jana Sena Party chief Pawan Kalyan offers sweets to his wife Anna Lezhneva in Hyderabad before leaving for Kondagattu to launch his ‘Chalo re Chalo’ yatra on Monday.
హిందువులకు సంబంధించి పంచెకట్టు ఫంక్షన్ ఒడుగు లాంటివి చిన్నతనంలో చేసే విధంగా క్రైస్తవ మతాచారం ప్రకారం అబ్బాయిలకు చిన్నతనంలో చేయాల్సిన ఒక ముఖ్య కార్యక్రమం పవన్ రెండవ కుమారుడు కోసం నిర్వహించబోతున్నట్లు సమాచారం. పవన్ భార్య అన్నా కోరిక ప్రకారం ఈకార్యక్రమం యూరప్ లోని ఒక ప్రముఖ చర్చ్ లో జరుగుతున్నట్లు తెలుస్తోంది.
chiranjeevi, pawan kalyan
ఈ కార్యక్రమం ముగించుకుని యూరప్ నుండి తిరిగి వచ్చిన తరువాత పవన్ ఎక్కువ సమయం అమరావతిలోనే ఉంటూ పార్టీ నిర్మాణానికి సంబంధించిన పనుల పై దృష్టి పెడతాడని ‘జనసేన’ పార్టీ వర్గాలు ఒక ప్రకటనలో తెలియచేసారు. ఇది ఇలా ఉండగా జనసేన పార్టీలోకి వివిధ పార్టీలకు చెందిన కొందరు నాయకులు ప్రవేసించి ఇప్పటి వరకు ‘జనసేన’ కోసం కష్టపడిన కార్యకర్తలను సైడ్ లైన్ చేస్తున్న పరిస్థుతులు ఏర్పడటంతో జనసైనికులు తీవ్ర అసహనంలో ఉన్నట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: