మెగాస్టార్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ‘సైరా’ బిజినెస్ వ్యూహాలకు అనుకోని విధంగా ప్రభాస్ అడ్డు తగలడం మెగా కాంపౌండ్ కు షాక్ ఇస్తోంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ‘బాహుబలి’ తో నేషనల్ సెలిబ్రిటీగా ఏదిగిపోయిన ప్రభాస్ తన ఇమేజ్ ని క్యాష్ చేసుకోవడాని ‘సాహో’ సినిమాలో నటిస్తూనే ఆసినిమా విడుదల కాకుండానే ‘జిల్’ రాధ కృష్ణ దర్శకత్వంలో ఒక డిఫెరెంట్ లవ్ స్టొరీని మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈమూవీకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి అయింది. 

ఇది ఇలా ఉండగా ‘సాహో’ ను వచ్చే ఏడాది ఆగుస్ట్ 15న విడుదల చేయబోతున్నట్లు 9నెలల ముందు ప్రకటించి తన సినిమాకు మరి ఏపెద్ద హీరో సినిమాతో పోటీ లేకుండా చూసుకున్నాడు. ఇప్పడు ఇది చాలదు అన్నట్లుగా ప్రభాస్ 2020 సంక్రాంతి రేస్ పై కూడ కన్ను వేయడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

చిరంజీవి ‘సైరా’ కు భారీ గ్రాఫిక్స్ పనులు ఉన్న నేపధ్యంలో ఈమూవీని 2020 సంక్రాంతికి విడుదల చేసే ఉద్దేశంలో మెగా కాంపౌండ్ ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి మెగా కాంపౌండ్ నుంచి లీకులు కూడ వస్తున్నాయి. అయితే ప్రభాస్ ఈవిషయాలను పట్టించుకోకుండా జిల్ రాథా కృష్ణ దర్శకత్వంలో చేస్తున్న మూవీకి సంబంధించి రిలీజ్ డేట్ లీకులు ఇస్తున్నాడు. 

ప్రస్తుతం ఇండస్ట్రీలో వినపడుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ తన ‘సాహో’ ను వచ్చే ఏడాది ఆగష్టు 15న జిల్ రాథా కృష్ణతో చేస్తున్న మూవీని 2020 సంక్రాంతికి విడుదల చేసే స్పష్టమైన ప్రణాళికలలో ఉన్నట్లు టాక్. దీనితో చిరంజీవి ‘సైరా’ కు  2020 సంక్రాంతి  సీజన్ కూడ మిస్ అవుతుందని అందువల్ల మరొక డేట్ వెతుక్కోవలసిన పరిస్థితి చిరంజీవికి ఏర్పడుతుంది అని అంటున్నారు. దీనితో ప్రభాస్ ముందస్తు వ్యూహాలు అనుకోకుండా మెగా స్టార్ చిరంజీవికే ఖంగారు పెట్టిస్తున్నట్లు టాక్..   



మరింత సమాచారం తెలుసుకోండి: