నేషనల్ సెలెబ్రెటీ స్థాయికి ఎదిగిపోయిన ప్రభాస్ కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న ‘కాపీ విత్ కరణ్ జోహార్’ కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈషో నిన్న బుల్లితెర పై టెలికాస్ట్ అయింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈషో ఇప్పటికే హాట్ టాపిక్ గా మారడంతో నిన్న ప్రసారం అయిన ఈ షోకు భారీ రేటింగ్స్ వచ్చాయి. 
భార్యగా, తల్లిగా

ఈషోలో అనేక ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన ప్రభాస్ అనుష్క విషయంలో ఎవరూ ఊహించని ఒక షాకింగ్ రిప్లయ్ ఇచ్చాడు. తాను అనుష్కతో ఎక్కువ సినిమాలు నటించడం వల్ల తమ మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం చూసే వారికి తామిద్దరం డేటింగ్ చేస్తున్నాము అన్న అనుమానాలకు తావు ఇచ్చింది అంటూ కామెంట్స్ చేసాడు.
వైరల్ అవుతున్న రూమర్
అయితే ఈవార్తలు అన్నీ గాసిప్పులు అని అంటూ ‘బాహుబలి’ సినిమాలో తనకు ప్రేయసిగా తల్లిగా నటించిన హీరోయిన్ తో డేటింగ్ ఎలా చేస్తాను అంటూ విచిత్రమైన సమాధానం ఇచ్చి ఆ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్న కరణ్ జోహార్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసాడు. అయితే ఇక్కడే మరొక ట్విస్ట్ ఇస్తూ తన దృష్టిలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సెక్సీ బ్యూటీగా తాను అనుష్కకు నూటికి నూరు మార్కులు వేస్తాను అంటూ ఆ ఇంటర్వ్యూ చూస్తున్న బుల్లితెర ప్రేక్షకులకు మైండ్ బ్లాంక్ చేసే ప్రయత్నాలు చేసాడు.
తొందరపడకండి
ఇదే ఇంటర్వ్యూలో కాజల్ తమన్నా అనుష్కలలో తనకు ఎవరు నచ్చిన హీరోయిన్ అంటూ అడిగిన ప్రశ్నకు ఏమాత్రం ఆలోచన చేయకుండా తనకు అనుష్కతో నటించడం చాల కంఫర్ట్ అంటూ అనుష్క పై తనకు ఉన్న అభిమానాన్ని మరొకసారి చాటుకున్నాడు. అయితే ప్రభాస్ అనుష్క విషయంలో ఇచ్చిన రకరకాల సమాధానాలు పరిశీలిస్తే ప్రభాస్ అన్యాపదేశంగా తాను అనుష్కతో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నాను అన్న భావాన్ని పరోక్షంగా తెలియచేసినట్లు కనిపిస్తోంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: