టాలీవుడ్ ఫిలింఇండస్ట్రీలో చాలామంది హీరోలున్నా మంచి పర్సనాలిటీ కల హీరోలు చాల కొద్దిమంది మాత్రమే కనిపిస్తారు. సీనియర్ హీరోలు  చిరంజీవి బాలకష్ణ ఇద్దరూ ఇంచుమించు ఒకే హైట్ ఆతర్వాత సీనియర్ హీరోలలో నాగార్జున వెంకటేష్ లు మాత్రమే మంచి హైట్ లో ఉంటారు. 

ప్రభాస్ గోపీచంద్ లాంటి పొడుగైన హీరోలు వచ్చేవరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగార్జున వెంకటేష్ మాత్రమే బాగా పొడుగుగా ఉండే హీరోలు అన్న కామెంట్స్ వస్తూ ఉండేవి. సీనియర్ హీరో  వెంకటేశ్ హైట్ 6 అడుగుల 2 అంగుళాలు అవడంతో అతడి పక్కన ఎంతటి పొడువైన హీరోయిన్ అయినా వెంకీ పక్కన పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అని అందరు భావిస్తూ వచ్చారు.

అందువల్లనే వెంకటేష్ చాలా సులువుగా కత్రినా కైఫ్ శిల్పాశెట్టి లాంటి పొడుగు కాళ్ళ సుందరిలతో చాలా సులువుగా మ్యాచ్ కాగలిగాడు.  అలాంటి వెంకటేష్ ఇప్పుడు సడన్ గా పొట్టివాడైపోవడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం ప్రస్తుతం వెంకటేష్ వరుణ్ తేజ్ తో కలిసి నటిస్తున్న ‘ఎఫ్ 2’ మూవీ ఈమూవీ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈసినిమాకు సంబంధించి వెంకటేష్ వరుణ్ తేజ్ లపై కలిపితీస్తున్న సన్నివేశాలతో చాలా పాట్లు పడుతున్నట్లు సమాచారం. వరుణ్ హైట్ 6అడుగుల 4అంగుళాలు అయిన నేపధ్యంలో ‘ఎఫ్ 2’ సినిమాకుసంబంధించి అన్ని సీన్స్ లో వెంకటేష్ వరుణ్ తేజ్ ముందు పొట్టిగా కనిపించాడని సమాచారం. 

ఇక వీరిద్దరి పై కలిపి  చిత్రీకరించిన పాటల విషయంలో దర్శకుడు అనిల్ రావిపూడి ఎంత ప్రయత్నించినా వరుణ్ తేజ్ ని డామినేట్ చేయడం వెంకీ వల్ల కాలేదు అనిటాక్. దీనితో వెంకటేష్ ను వరుణ్ తేజ్ కన్నా పొడుగుగా చూపించేందుకు అనిల్ రావిపూడి ఎన్నిమార్గాలు ఉంటే అన్నీ అనుసరిస్తున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: