మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇటీవల ‘ఒడియన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో రిలీజ్ చేశారు.  అయితే రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో మిశ్రమ స్పందన వచ్చింది.  దాంతో ఈ చిత్రం బాక్సాఫిస్ వద్ద డీలా పడింది. ఫాంటసీ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మోహన్ లాల్ కు పరాజయాన్ని అందించింది. సినీ ఇండస్ట్రీలో ప్రతిసారి విభిన్నమైన పాత్రల్లో కనిపించే మోహన్ లాల్ ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డారు.
Image result for odian movie telugu posters
ఈ చిత్రంలో రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించాడు..ఒక పాత్రలో యువకుడిలా కనిపించడానిక ఏకంగా పది కిలోలు కూడా తగ్గారట.  కానీ ఈ చిత్రం మాత్రం అనుకున్న విషయాన్ని అందుకోలేక పోయింది.  ప్రస్తుతం మోహన్ లాల్ ‘మరక్కార్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ప్రియదర్శన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
Image result for priyadarshan mohan lal
ఈ చిత్రంలోనుండి  విడుదలైన మోహన్ లాల్ ఫస్ట్ లుక్ ఆయన అభిమానులను ఆకట్టుకుంటుంది. విభిన్నమైన కథా చిత్రాల దర్శకుడిగా ప్రియదర్శన్ కి మంచి పేరు వుంది. ఆయన తర్శకత్వంలో మోహన్ లాల్ చిత్రం అంటే అభిమానుల్లో మరింత ఉత్సహం రేకెత్తిస్తుంది.
Image result for priyadarshan kalyani
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో దర్శకుడు ప్రియదర్శన్ కూతురు కళ్యాణి ప్రియదర్శిని ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.  ఈ చిత్రంలో కీర్తి సురేష్,  ప్రణవ్ మోహన్ లాల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది చివర్లో విడుదలకానుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: