ఈ మద్య కొత్త దర్శకులు, నటీ నటులు మంచి కథాంశాలతో చిత్రాలు తీస్తూ విజయాలన్ని అందుకుంటున్నారు.  కొత్త దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సంపత్ వంగా ‘అర్జున్ రెడ్డి ’ చిత్రంతో విజయ్ దేవరకొండకు సూపర్ హిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.  రాంగోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి ‘ఆర్ ఎక్స్ 100’లాంటి చిత్రంతో కార్తీకేయ, పాయల్ రాజ్ పూత్ కి మంచి విజయాన్ని అందించారు. అయితే ఈ రెండు చిత్రాల్లో బోల్డ్ కంటెంట్ ఉన్నా..ప్రేక్షకులు బాగానే రిసీవ్ చేసుకున్నారు. 

తాజాగా నూతన ద‌ర్శ‌కుడు రామ్ కుమార్ దర్శకత్వంలో ఓ.య‌స్‌.యం విజన్ – దివ్యాషిక క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘నేను లేను’ `లాస్ట్ ఇన్ లవ్` అనేది ఉప‌శీర్షిక‌. ఈ చిత్రంలో హ‌ర్షిత్ హీరోగా నటిస్తోన్నాడు.  ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.  ఒక అందమైన ప్రేమకథతో తెర‌కెక్కిన‌ సైకలాజికల్ థ్రిల్లర్ ఇది.

ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ర‌క్తి క‌ట్టిస్తుంది. థ్రిల్లింగ్ కాన్సెప్టుతో తీస్తే న‌వ‌త‌రం నటీన‌టుల‌తో తీసిన సినిమా అయినా ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు అనే నమ్మకం ఉందంటున్నారు చిత్ర యూనిట్. ఇప్పటివరకు భార‌త‌దేశంలో రాని సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్న చిత్రమిద‌ని చెప్పేందుకు గ‌ర్వంగా ఫీల‌వుతున్నాం అన్నారు. చిత్రీక‌ర‌ణ స‌హా అన్ని ప‌నులు పూర్త‌య్యాయి. ఈ నెల 24న ట్రైల‌ర్ ను, ఫిబ్ర‌వ‌రిలో చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: