బాలీవుడ్ లో బంపర్ హిట్ అయిన క్వీన్ సినిమాను దక్షిణాది భాషల్లోకి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే.. వేరు వేరు భాషల్లో వేరు వేరు భామలతో ఈ సినిమా రీమేక్ చేశారు. తమిళంలో కంగనా పాత్రను హీరోయిన్ కాజల్ పోషించింది.



21 విడులదలైన ఈ పారిస్ పారిస్ సినిమా ట్రైలర్ యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. ట్రెండింగ్‌ లో నిలుస్తోంది. నాలుగు రోజుల్లోనే ఈ ట్రైలర్‌ ను 50 లక్షల మంది చూసేశారంటే ఎంత ఆసక్తికరంగా ఉందో ఊహించుకోండి. ఐతే.. ఈ ట్రైలర్ లో ఓ తమాషా కూడా చోటు చేసుకుంది.



కాజల్ తన రూమ్ మేట్‌తో ఉన్న సమయంలో ఆ రూమ్ మేట్ టీవీ చూస్తూ హఠాత్తుగా కాజల్ ఎదను ఒక్కసారిగా పిండేస్తుంది.. ఈ సీన్‌ ను ఇలాగే ట్రైలర్ లో ఉంచడం కూడా హాట్ టాపిక్ గా మారింది. అలా నేరుగా చూపించడంపై పలు రకాల కామెంట్స్ వస్తున్నాయి.


సినిమాలో సందర్భం ఏదైనా అలా పచ్చిగా చూపించారని కొందరు అంటుంటే.. .. దాన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని మరికొందరు అంటున్నారు. అయితే ట్రైలర్ లో ఈ సీన్ కొన్ని సెకన్ల పాటే వచ్చి వెళ్లిపోతుంది కాబట్టి.. జాగ్రత్తగా చూస్తే తప్ప ఈ సీన్ రిజిస్టర్ కాదు. మరి ఈ సీన్ ను సినిమాలో ఎలా జస్టిపై చేసుకుంటారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: