రాజమౌళి ట్విటర్ ఎకౌంట్ కు 4.4 మిలియన్ ల ఫాలోయర్స్ ఉన్నారు అంటే రాజమౌళి క్రేజ్ ఏస్థాయిలో ఉందో అర్ధం అవుతుంది. ఇలాంటి ఉన్నత స్థానంలో ఉన్న రాజమౌళి ఒక సినిమా గురించి ఒక కామెంట్ చేసాడు అంటే ఆవిషయాలను అతడి అభిమానులు గుడ్డిగా నమ్ముతారు. అయితే ఈమధ్య కాలంలో రాజమౌళి చెప్పే మాటలలో విశ్వసనీయత తగ్గిపోతోంది అన్న కామెంట్స్ వస్తున్నాయి.

దీనికికారణం రాజమౌళి కొన్ని చెత్త సినిమాలను కూడ చాల బాగున్నాయి అంటూ గత కొద్ది కాలంగా చేస్తున్న ప్రచారం. ముఖ్యంగా ఫ్లాప్ సినిమాలుగా పేరు తెచ్చుకున్న ‘యుద్ధం శరణం’ ‘పటేల్ సార్’ ‘పైసా వసూల్’ లాంటి సినిమాలు కూడ బాగున్నాయి అంటూ రాజమౌళి కొద్ది కాలం క్రితం ట్విట్స్ చేసి అనేక విమర్శలకు కారణం అయ్యాడు. 

ఇప్పుడు ఆవిషయాల పై రాజమౌళి తన తప్పును గ్రహించుకున్నట్లుగా అనిపిస్తోంది. మొన్న ఆదివారం ప్రసారం అయిన కరణ్ జోహార్ షో ‘కాపీ విత్ కరణ్ జోహార్’ కార్యక్రమంలో ప్రభాస్ రానా లతో కలిపి పాల్గొన్న రాజమౌళి ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ తాను గతంలో చేసిన పొరపాట్లు తెలుసుకున్నాను అంటూ కామెంట్స్ చేసాడు.

ముఖ్యంగా తనలాంటి స్థాయిగల వ్యక్తి ఒక సినిమా గురించి కామెంట్స్ చేసినప్పుడు ఆవిషయాలు నిజం అని జనం అనుకుంటారని అందువల్ల భవిష్యత్ లో ఒక సినిమా గురించి కామెంట్ చేసేడప్పుడు తాను మొహమాటాలకు పోయి ఒక ఫెయిల్యూర్ సినిమాను ప్రమోట్ చేయకూడదు అన్న విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్నాను అంటూ కామెంట్స్ చేసాడు జక్కన్న. అంతేకాదు ఒక సినిమా పరాజయాన్ని నిజయితీగా అంగీకరిస్తే గౌరవం పెరుగుతుంది అంటూ రాజమౌళి చేసిన కామెంట్స్ ను బట్టి భవిష్యత్ లో రాజమౌళి తన సినిమాలకు తప్ప మరి ఏఇతర దర్శకుల సినిమాల గురించి మాట్లాడను అని పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నట్లు ఉంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: