తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో తో బాగా పాపులారిటీ తెచ్చుకున్న యాంకర్లు అనసూయ, రష్మి ఇప్పుడు వెండి తెరపై కూడా జోరు కొనసాగిస్తున్నారు.  రష్మి అయితే ఏకంగా కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. అయితే ఈ అమ్మడు నటించిన చిత్రాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్లుగా మిగిలాయి..దాంతో తిరిగి బుల్లితెరపైనే కొనసాగుతూ వస్తుంది.  ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటే రష్మీ తాజాగా తన అభిమాని అడిగిన ప్రశ్నలకు దిమ్మతిరిగే సమాధానం..చాలా బోల్ట్ గా ఇచ్చింది. 
Image result for anchor reshmi hot pics
రష్మీ తాజాగా ట్విట్టర్లో లైవ్ చాట్ చేసింది. మీకు ఎలాంటి ప్రశ్నలు అంటే నచ్చవు' అని ఒక అభిమాని అడిగితే, 'పెళ్లి గురించిన ప్రశ్నలు .. వయసుకి సంబంధించిన ప్రశ్నలు అడగడం నాకు నచ్చదు' అని చెప్పింది. ఇదే క్రమంలో ఓ అభిమాని మీరు ఒకవేళ పెళ్లి చేసుకోవాల్సి వస్తే..సుధీర్, ప్రదీప్ ఈ ఇద్దరిలో ఎవరిని చేసుకుంటారని అడిగిన ప్రశ్నకు.. రష్మీ స్పందిస్తూ .. 'నా వర్క్ లైఫ్ .. పర్సనల్ లైఫ్ రెండూ వేరు వేరుగా ఉంటాయి.
Image result for anchor reshmi hot pics
ఇందులో వుండే వ్యక్తులు అందులోకి .. అందులో వుండే వ్యక్తులు ఇందులోకి రావడం జరగదు' అని స్పష్టం చేసింది.  మరో అభిమాని  'లవ్ మ్యారేజ్ .. అరేంజ్డ్ మ్యారేజ్ లో దేనిని ఎంపిక చేసుకుంటారు?' అన్ని ప్రశ్నకు బోల్డ్ గా సమాధానం ఇస్తూ..హలో..మధ్యలో 'సహజీవనం' అనే ఆప్షన్ మరొకటి ఉందిగదా'  అంటూ జవాబుతో షాక్ ఇచ్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: