ఈమధ్య కాలంలో సుమంత్ తన సినిమాలకు సంబంధించి వేగం పెంచాడు. ఈనెల విడుదలైన ‘సుబ్రహ్మణ్యపురం’ వల్ల వచ్చిన మంచి పేరును కొనసాగిస్తూ రేపు ‘ఇదం జగత్’ అనే మూవీతో ఈ ఏడాదికి అక్కినేని ఫ్యామిలీ తరఫున గుడ్ బై చెప్పబోతున్నాడు సుమంత్. ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ అల్లబడిన ఈమూవీ కథలో సుమంత్ న్యూస్ రిపోర్టర్ గా నటిస్తున్నాడు.
ఆత్మవిశ్వాసంతో చేశా
ఈమూవీని ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమంత్ తనను జూనియర్ ఎన్టీఆర్ తో పోల్చుకుంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. నందమూరి తారకరామారావు పోలికలు అచ్చు గుద్దినట్లు జూనియర్ ఎన్టీఆర్ కు వచ్చిన విధంగా తనకు తన తాత అక్కినేని నాగేశ్వరావు పోలికలు వచ్చాయని అంటూ తమ అక్కినేని నందమూరి కుటుంబాలలో తమ తాతల పోలికలు వచ్చి వారసత్వాన్ని కొనాగిస్తున్నది తాము ఇద్దరమే అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసాడు. 
మహానటిలో చైతు
ఇదే సందర్భంలో తాము తన తాత అక్కినేని పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ మూవీ గురించి మాట్లాడుతూ నాగాచైతన్య నటనను టార్గెట్ చేస్తూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ‘మహానటి’ మూవీలో చైతన్య అక్కినేని నాగేశ్వరావు పాత్రను పోషించి ప్రశంసలు అందుకున్నా అది అక్కినేని యంగ్ పాత్ర కాబట్టి పెద్దగా కష్ట పడవలసిన అవసరం లేదని అయితే తాను నటించిన ఎన్టీఆర్ బయోపిక్ లో అక్కినేని పాత్రకు సంబంధించి నడివయసు పాత్రలో నటించడానికి తాను కష్టపడవలసిన అవసరం ఏర్పడింది అంటూ తనకు సజహంగా ఉన్న తన తాత అక్కినేని పోలికలు ఆ పాత్రను రక్తికట్టించడంలో బాగా సహాయ పడిన విషయాలను వివరించాడు.
ఇమిటేట్ చేయలేదు
ఇదే సందర్భంలో తన తాత అక్కినేనికి తన పై ఉన్న ప్రేమను గురించి మాట్లాడుతూ తాను ఇంజనీరింగ్ చదివే రోజులలో తాను చదువు మాని సినిమాలలోకి వస్తాను అంటే తన తాత ఇచ్చిన ప్రోత్సాహాన్ని గుర్తుకు చేసుకుంటూ తన తాత సహాయం లేకుంటే తన కెరియర్ లేదు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసాడు. మంచి నటుడుగా పేరున్నా సుమంత్ కు సినిమాల విషయంలో హిట్స్ లేకపోవడంతో సంవత్సరాలు గడిచిపోతున్నా సుమంత్ కెరియర్ అలాగే కొనసాగుతోంది. దీనితో ఈ ‘ఇదంజగత్’ అయినా సుమంత్ కు కోరుకున్న బ్రేక్ ను ఇస్తుందేమో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: