బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఏం చేసినా అది సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది.  ఆయన స్టైల్ గా నడిచిని..డ్యాన్స్ చేసినా..ఫన్నీగా ఫైట్ చేసినా..సెలబ్రెటీలతో స్టెప్పులు సోషల్ మీడియాలో సందడే సందడి.  నేడు సల్మాన్ ఖాన్ 53 వ పుట్టిన రోజు..ఈ సందర్భంగా ఆయనకు పలువురు సెలబ్రెటీలు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

అయితే సల్మాన్ ఖాన్ ఈ తన బర్త్ డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా జరుపుకున్నట్లు కనిపిస్తుంది. ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు ఈ పార్టీకి తరలి వచ్చారు. పార్టీకి వచ్చిన వారిలో కత్రినా కైఫ్, సోనాక్షి సిన్హా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, మౌనీ రాయ్, బాబీ డియోల్, జహీర్ ఇక్బాల్, అర్భాజ్ ఖాన్, సొహైల్ ఖాన్, అతుల్ అగ్నిహోత్రి తదితరులు ఉన్నారు.

ఇదంతా ఒక ఎత్తైతే..సల్మాన్ ఖాన్ బర్త్ డే పార్టీకి వచ్చిన సుస్మితా సేన్ తో కండల వీరుడు చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  ఈ సందర్భంగా సుస్మిత తన డ్యాన్స్ వీడియోను ఇన్ స్ట్రాగామ్ లో పోస్ట్ చేసి..మాకు డ్యాన్స్ చేసే అవకాశాన్ని జీవితం ఎప్పుడు కల్పించినా... మేము డ్యాన్స్ చేస్తాం.

మంచి హృదయం ఉన్న సల్మాన్ కు జన్మదిన శుభాకాంక్షలు. నిన్ను ఎప్పటికీ అభిమానిస్తుంటాననే విషయం నాకు తెలుసు' అంటూ కామెంట్ పెట్టింది. సల్మాన్, సుస్మితలు 'బీవీ నెంబర్ 1', 'మైనే ప్యార్ క్యో కియా' సినిమాల్లో కలసి నటించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: