సూపర్ స్టార్ మహేష్ బాబుకు హైదరాబాద్ కు చెందిన జీఎస్టీ కమిషనరేట్ ఊహించని షాక్ ఇచ్చింది. 2007- 08 సంవత్సరానికిసంబంధించి మహేష్ బాబు సేవా పన్నుకట్టక పోవడంతో   అతడి బ్యాంక్ అకౌంట్లు అటాచ్ చేస్తున్నట్లు జీఎస్టీ అధికారులు ఒక ప్రకటన విడుదలచేసి అందరికి షాక్ ఇచ్చారు. 

మహేష్ బాబు పలు సంస్థలను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్‌ గా వ్యవహరిస్తు కోట్ల రూపాయలలో పారితోషికం తీసుకున్తున్నపటికి ఆ యాడ్స్ కు సంబంధించి తనకు వచ్చిన ఆదాయానికిసంబంధించి మహేష్ సర్వీస్ ట్యాక్స్ కట్టలేదని అధికారుల ఆరోపణ. 18.5 లక్షల సేవాపన్ను మహేష్ కట్టనందుకు కాను నిన్నటిరోజున జీఎస్టీ అధికారులు మహేష్ బాబుకు చెందిన ఐసీఐసీఐ బ్యాంకు ఖాతా యాక్సిస్ బ్యాంకు ఖాతాలను అటాచ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 
 
అయితే ఈ విషయం పై మహేష్ బాబు ఇంకా స్పందించలేదు. జీఎస్టీ అధికారులు మహేష్ బ్యాంకు అకౌంట్స్ ను అటాచ్ చేయడంతో ఈ సేవపన్నుకు సంబంధించి వడ్డీ జరిమానా లాంటి అన్ని విషయాలు సెటిల్ అయ్యే వరకు మహేష్ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన సమస్యలు కొనసాగే అవకాసం కనిపిస్తోంది. 

గతంలో ‘నాన్నకు ప్రేమతో’ విడుదల సమయంలో ఎన్టీఆర్ కు కూడా ఇలాంటి సమస్యలే ఎదురై పన్నులు ఎగవేశారనే ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ఆవార్త కూడ సంచలనం సృష్టించింది. లక్షలాది మంది అభిమానులకు రోల్ మోడల్ గా ఉండవలసిన సెలెబ్రెటీలు ఇలాంటి చిన్న విషయాలకు కూడ అశ్రద్ద చేస్తూ సమస్యలలో ఇరుక్కోవడం ఆశ్చర్యంగా మారింది..   



మరింత సమాచారం తెలుసుకోండి: