తమఅభిమానులే తమకుదేవుళ్ళు అంటూ టాప్ హీరోలు అంతా తమ సినిమాల ఫంక్షన్స్ లో పొగడ్తలు కురిపిస్తూ తమఅభిమానులను బుట్టలో పడేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భమే నిన్నజరిగిన ‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో జరిగింది. రామ్ చరణ్ తన ఉపన్యాసంలో మాట్లాడుతూ ఎవరికైనా ఒకకుటుంబం ఉంటుందని అయితే తన తండ్రి చిరంజీవి వల్ల తనకు లక్షలాది మంది అభిమానులు ఉన్న మెగా ఫ్యాన్స్ కుటుంబం తనకు లభించింది అంటూ అభిమానుల పై ప్రశంసలు కురిపించాడు. 
 నాన్నగారిలా అన్నీ చేయాలని ఉంది
అయితే ఇంతవరకు బాగానే ఉన్నా చిరంజీవి అభిమాన సంఘానికి చెందిన కొందరు ‘రాష్ట్ర చిరంజీవి యువత’ పేరుతో నిన్న ఉదయం వాట్సాప్ లో పెట్టిన ఒక మెసేజ్ సంచలనంగా మారింది. ఈ ఫంక్షన్ కు సంబంధించి పాస్ ల కోసం పడినపాట్లును వివరిస్తూ ఉదయం నుండి సాయంత్రం దాకా బిచ్చగాళ్లలా ఈమూవీ ఫంక్షన్ కోసం వాళ్లనీవీళ్లనీ పాస్ ల కోసం తెగ బతిమాలాడుతున్న మెగా అభిమానుల పరిస్థితి పై కామెంట్స్ చేస్తూ ఆవాట్సాప్ మెసేజ్ ఉంది. 
బాస్ అనాలా? బిగ్ బాస్ అనాలా? మెగాస్టార్ అనాలా?
ఆడియో ఫంక్షన్స్ వల్ల ఆసినిమాలు తీస్తున్న నిర్మాతలకు ప్రయోజనం కలుగుతుందని అదేవిధంగా ఆఈవెంట్ ను నిర్వహించిన ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి భారీగా లాభాలు వస్తాయని తమ అభిమాన నటుడుని ఆరాధిస్తూ ఆడియో ఫంక్షన్ లు విజయవంతం చేసి సినిమా రిలీజ్ రోజున భారీ కలక్షన్స్ వచ్చేలా చేసి హీరోలు పిలుపును ఇచ్చిన విధంగా ‘సేవా కార్యక్రమాలు చేస్తూ అనేక విధాలుగా నష్టపోయేది అభిమానులు మాత్రమే’ అంటూ ఆఅజ్ఞాత మెగా అభిమాని వాట్సాప్ లో పెట్టిన మెసేజ్ సంచలనంగా మారింది.అంతేకాదు బయట ఊళ్ళ నుండి ముఖ్యంగా బెంగుళూరు లాంటి దూర ప్రదేశాల నుండి తమ మెగా హీరోలను చూడాలి అంటూ మెగా హీరోల ఫంక్షన్స్ కు వస్తున్న వీరాభిమానులకు సుమారు 5వేల వరకు ఖర్చు అవుతుందనీ నిన్న జరిగిన ‘వినయ విదేయ రామ’ మూవీ ఫంక్షన్ కు బయట ఊళ్ళ నుండి సుమారు 6 వేలమంది అభిమానులు వచ్చినా వారిని సరిగ్గా నిర్మాతగానీ ఈవెంట్ ఆర్గనైజర్స్ గానీ సరిగ్గా పట్టించుకోకపోవడం తనకు ఆశ్చర్యం కలిగించింది అంటూ ఆవీరాభిమాని తన వాట్సాప్ సందేశంలో పేర్కొన్నాడు. 
నాలుగు సంవత్సరాల క్రితం కథ విన్నా..
ఆంధ్ర, తెలంగాణా, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఒరిస్సా మరియు కేరళ రాష్ట్రాల నుండి అభిమానులు వేలాదిగా వచ్చినా పట్టించుకోలేదు అంటూ ఆ అభిమాని ఆవేదన. ముఖ్యంగా మెగా హీరోల సినిమాలకు సంబంధించి మెగా అభిమానులలోని  ఒక్కొక్క అభిమాని చేసే పబ్లిసిటీ ఒక నిర్మాత డబ్బులు ఇచ్చి చేయించుకోవలసి వస్తే కోట్లకు కోట్లు ఖర్చు అవుతుంది అంటూ ఆ మెగా అభిమాని వ్యక్త పరిచిన బాధ రామ్ చరణ్ వరకు చేరుకుంటుందా అన్నదే సమాధానం లేని ప్రశ్న.. 


మరింత సమాచారం తెలుసుకోండి: