ఆర్‌ఎక్స్ 100.. ఈ మధ్య ఎవరినోట విన్నా ఈ టైటిల్ బాగా వినిపిస్తోంది. రొమాంటిక్, క్రైమ్ మూవీగా అందరినీ ఆకట్టుకుందీ మూవీ. చిన్న బడ్జెట్ సినిమాయే అయినా బంపర్ హిట్ గా నిలిచింది. ఈ టైటిల్‌తోనే సగం ఇంట్రస్ట్‌ కలిగించింది.

Image result for hero naresh senior


ఆర్‌.ఎక్స్‌. 100 బైక్‌ పేరు మీద ఈ సినిమా తీశారు. అదే ఆర్‌ఎక్స్ 100 బైక్‌ సీనియర్ నరేశ్ జీవితాన్ని కూడా మలుపు తిప్పిందట. ఈ విషయాన్ని ఆయనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఆర్‌ఎక్స్ 100 బైక్‌ మార్కెట్లోకి కొత్తగా వచ్చిన రోజుల్లో ఆ బైక్ ఉపయోగించి రెండు కుటుంబాల కథ సినిమాలో కొన్ని సీన్లు తీశారట.

Image result for rx 100 bike


ఈ రెండు కుటుంబాల కథ సినిమాకు నరేశ్ తల్లి విజయనిర్మలే డైరెక్టర్. ఓ సీన్‌లో హీరో నరేష్‌ ఆర్‌ఎక్స్ 100 బైక్ పై జంప్ చేయాలి. ఈ సీన్ చేసిన మొదటి షాట్‌లోనే ఓకే అయ్యిందట. కానీ నరేశ్ మరోసారి్ చేస్తానని చెప్పడంతో మళ్లీ చేశారట. కానీ ఈసారి బైక్‌ గాల్లో లేచి పెద్ద యాక్సిడెంట్ అయ్యిందట.

Related image


ఆర్‌ఎక్స్‌ 100 బైక్ 20 అడుగులు గాల్లోకి లేచిన తర్వాత స్పృహ కోల్పోయాడట నరేశ్. ఆ తర్వాత కళ్లు తెరచి చూస్తే ఒళ్లంతా రక్తంతో కారులో ఉన్నాడట. ఆ సమయంలో దాదాపు మూడు నెలలు ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చిందట. ఈ యాక్సిడెంట్ తర్వాత నటనకు కామా పెట్టి రాజకీయాల్లోకి వెళ్లాడట నరేష్. అదీ నరేశ్‌ ఆర్‌ఎక్స్ 100 ఫ్లాష్‌ బ్యాక్.


మరింత సమాచారం తెలుసుకోండి: