టాప్ హీరోల సినిమాల సందడి సంవత్సరానికి ఒకటిమించి ఉండటం గగనంగా మారిపాయింది. దీనితో ఈఏడాది సినిమాల హడావిడి అంతా మీడియం స్థాయి హీరోల సినిమాలతోనే కొనసాగింది. నువ్వా నేనా అన్నట్లుగా చాలామంది మీడియం రేంజ్ హీరోలు ఈఏడాది మూడు సినిమాలలో కనిపించినా వారందరికీ ఈఏడాది చేదు అనుభవాలనే మిగిల్చింది. అయితే ఈవిషయంలో ఒక్క విజయ్ దేవరకొండకు మినహాయింపు లభించి విజయ్ టాలీవుడ్ ఇండస్ట్రీ వసూళ్ళ కొండగా మారిన విషయం తెలిసిందే. 

ఇలాంటి పరిస్థుతులలో మీడియం రేంజ్ హీరోలలో ప్రధమస్థానంలో కొనసాగే నాని మ్యానియా ఈసంవత్సరం బాగతగ్గింది. ఈసంవత్సరం నాని నుండి ‘కృష్ణార్జునయుద్ధం’ ‘దేవదాసు’ సినిమాలు వచ్చినా ఆరెండిటితోను నానీకి నిరాశే ఎదురైంది. ఇక ఈలిస్టులో మరో సీనియర్ యంగ్ హీరో నితిన్ పరిస్థితి మరింత నిరాశపరిచింది. అతడు నటించిన ‘శ్రీనివాసకళ్యాణం’ ‘ఛల్ మోహన్ రంగా’ సినిమాలు ఫెయిల్ కావడంతో నితిన్ పరిస్థితి అయోమయ పరిస్థితిగానే మారింది. అక్కినేని వారసుడుగా వచ్చిన నాగచైతన్య పరిస్థితి కూడ అంతంత మాత్రమే. ‘శైలజా రెడ్డి అల్లుడు’ ‘సవ్యసాచి’ సినిమాల ఫెయిల్యూర్ తో చైతు మాత్రమే కాదు నాగార్జున కూడ డీలాపడిపోయాడు.

ఇక ఈసంవత్సరం సాయి ధరమ్ తేజ్ కు జీవితంలో మరిచిపోలేని పీడకల. అతడు నటించిన ‘ఇంటలిజెంట్’ ‘తేజ్ ఐ లవ్ యూ’ సినిమాల పరాజయంతో అసలు ఇండస్ట్రీలో తేజ్ కెరియర్ కొనసాగుతుందా అన్నఅనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదేపరిస్థితి యంగ్ హీరో నిఖిల్ కు కూడ కొనసాగుతోంది. అతడు నటించిన ‘కిర్రాక్’ పార్టీ ఫెయిల్ అవ్వడంతో అతడు లేటెస్ట్ గా నటించిన ‘ముద్ర’ సినిమాను విడుదల చేయడానికి కూడ భయపడిపోతున్నాడు. ఇలాంటి పరిస్తుతులలోనే కొనసాగుతున్నాడు బెల్లం కొండ శ్రీనివాస్. భారీ బడ్జెట్ తో ఇతడి సినిమాలను తీసినా పెట్టుబడిలో సగం కూడ వసూలు కాని పరిస్థితి. దీనికి ఉదాహరణ ‘సాక్ష్యం’ ‘కవచం’ సినిమాలు. 

అయితే ఈసంవత్సరం ‘ఛలో’ విజయంతో కెరియర్ ప్రారంభించిన నాగశౌర్యకు ‘నర్తనశాల’ కు తీవ్రనష్టాలను తెచ్చిపెట్టింది. అదేవిధంగా వరుణ్ తేజ్ కు ఈఏడాది ‘తొలిప్రేమ’ తో ఆశ కల్పించి ‘అంతరిక్షం’ తో నిరాశను మిగిల్చింది. ఇకఏకంగా సంవత్సరం గ్యాప్ తీసుకుని ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చిన శర్వానంద్ ‘పడి పడి లేచె మనసు’ మూవీకి 20 కోట్ల భారీనష్టం వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక వీరందరిలో సీనియర్ అయిన రామ్ పరిస్థితి కూడ ఇలాగే ఉంది. అతడు నటించిన ‘హలో గురూ ప్రేమకోసమే’ చాల కష్టపడి పాస్ మార్కులు వేయించుకుంది. ఇలా యంగ్ హీరోలు అంతా తామునటించే సినిమాలకు సంబంధించి కథల విషయంలో బడ్జెట్ విషయంలో దర్శకుల విషయంలో ఎన్నోజాగ్రత్తలు తీసుకుని సినిమాలలో నటించినా వీరందరికీ 2018 నిరాశపరిచిన సంవత్సరంగా మిగిలిపోవడంతో ప్రేక్షకులు పెట్టిన పరీక్షలో ఒక్క విజయ్ దేవరకొండ మాత్రమే గట్టెక్కడంతో ఈవాస్తవాలను జీర్ణించుకోలేని పరిస్థుతులలో ఈమీడియం రేంజ్ యంగ్ హీరోలు ఉన్నట్లు సమాచారం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: