రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లి రేపు జైపూర్ సమీపంలోని కూకాస్ లో ఉన్న ఒక స్టార్ హోటల్ లో అత్యంత ఘనంగా జరుగుతున్న నేపధ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ హీరోలు అంతా ఇప్పటికే జైపూర్ చేరుకున్నారు. ఈ పెళ్ళికి వస్తున్న అతిధులను రాజమౌళితో సమానంగా అందర్నీ ఆప్యాయంగా ఎదురు వెళ్ళి పలకరిస్తున్న అనుష్క ప్రభాస్ ల సాన్నిహిత్యం మరొకసారి కార్తికేయ పెళ్ళిలో కూడ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 
సెలెబ్రిటీల వివాహాలకు ఇది కామనే
ఇలాంటి పరిస్థుతులలో రామ్ చరణ్ భార్య తన ట్విటర్ లో షేర్ చేసిన ఈ పెళ్ళి హడావిడికి సంబంధించిన ఫోటోలతో పాటు ‘బంగారం వెడ్స్ ఎస్ఎస్’ అనే హ్యాష్ ట్యాగ్ అందర్నీ ఆకర్షిస్తూ ఆలోచింప చేస్తోంది. మరి కొందరైతే కార్తికేయ పెళ్ళిలో ఈ బంగారం ఎవరు ? అన్న అన్వేషణ కూడ మొదలుపెట్టేసారు. 
టాలీవుడ్ సెలెబ్రిటీలంతా
అయితే ఈ అన్వేషణలో కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. కార్తికేయ తనకు కాబోతున్న భార్య పూజ ప్రసాద్ ను ‘బమాగారం’ అంటూ ముద్దుగా పిలుస్తారట. అదేవిధంగా పూజ కూడ కార్తికేయను ‘ఎస్ఎస్’ అంటూ ముద్దుగా పిలుస్తుందట. ఇప్పుడు ఈ విషయాలు అందరికీ తెలిసేలా ఉపాసన చేసిన హ్యాష్ ట్యాగ్ సంచలనంగా మారింది.
రాంచరణ్ సతీమణి
 ఇప్పటికే జైపూర్ చేరుకున్న టాలీవుడ్ సెలెబ్రెటీలతో పాటు నాగార్జున నాగచైతన్య కుటుంబాలు చిరంజీవి వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలు ఈరోజు సాయంత్రం జరగబోతున్న సంగీత్ కార్యక్రమానికి చేరుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సంగీత్ కార్యక్రమంలో ప్రభాస్ తో కలిసి రాజమౌళి డాన్స్ చేయబోతున్నట్లు సమాచారం. ఇలా ఎలా చూసుకున్నా ప్రస్తుతం మీడియాలో కార్తికేయ పెళ్లి హడావిడికి సంబంధించిన ఫోటోలు సందడి చేస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: