రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్ళికి జైపూర్ వివాహ వేదికగా మారడంతో ఇండస్ట్రీకి సంబంధించిన అనేకమంది హీరోలు హీరోయిన్లు అంతా జైపూర్ బాట పట్టారు. రాజమౌళితో సన్నిహితంగా ఉండే అనేక మంది సందడడి చేస్తున్న ఈపెళ్లి వేడుకలలో కనిపించని ఇద్దరు స్టార్ హీరోలు ఇప్పడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారారు.   
 హాజరైన అతిథులు
ఫిలిం ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న గాసిప్పుల ప్రకారం ఈపెళ్లి వేడుకులకుసంబంధించి మహేష్ బన్నీలకు సాధారణ ఆహ్వానం అందింది కానీ రాజమౌళి నుండి వ్యక్తిగత ఇన్విటేషన్ అందలేదని తెలుస్తోంది. వాస్తవానికి మహేష్ తన భార్యా పిల్లతో దుబాయ్ లో హాలిడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తూ ఉన్నా ఈవేడుకలకు మహేష్ రావాలి అనుకుంటే ఈ హాలిడే ట్రిప్ ఏమి అడ్డు కాదని అంటున్నారు.
రాజమౌళి మూవీ స్టార్స్
ఇక అదేవిధంగా ఈ పెళ్ళి వేడుకలకు సంబంధించి రాజమౌళి నుండి వ్యక్తిగత ఆహ్వానం చిరంజీవి అరవింద్ లకు వచ్చినా అల్లు అర్జున్ కు వ్యక్తిగత ఆహ్వానం రాలేదు అని అంటున్నారు. వాస్తవానికి ప్రస్తుతం అల్లు అర్జున్ విదేశాలలో లేడు. అంతేకాదు ప్రస్తుతం బన్నీకి షూటింగ్ ల హడావిడి కూడ ఏమిలేదు. 
 కార్తికేయ, పూజా
అందువల్ల రావాలి అనుకుంటే బన్నీ ఈపాటికే ఈ పెళ్లి వేడుకలకు చేరుకొని ఉండేవాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఈ గాసిప్పులను రాజమౌళి సన్నిహితులు ఖండిస్తున్నారు. రాజమౌళి తనతో చాల సన్నిహితంగా ఉండే హీరోలను మాత్రమే ఈ పెళ్ళి వేడుకకు పిలిచాడనీ జనవరి 5 జరగబోతున్న కార్తికేయ మ్యారేజ్ రిసప్క్షన్ కు మహేష్ బన్నీలు ఖచ్చితంగా వస్తారని క్లారిటీ ఇస్తున్నారు. తెలివిగా వ్యవహరిస్తూ వివాదాలకు దూరంగా ఉండే రాజమౌళి తన కొడుకు పెళ్లి విషయంలో ఎవర్ని నొప్పించే విధంగా వ్యవహరించడని రాజమౌళి సన్నిహితుల అభిప్రాయం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: