నందమూరి బాలకృష్ణ ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చి నాలుగు దశాబ్దాలు దాటుతూ ఉన్నా ఇండస్ట్రీ రికార్డుల విషయంలో బాలయ్య ఇప్పటికీ వెనుకబడే ఉన్నాడు. అతడి 100వ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కూడ బాలయ్య 100 కోట్ల నెట్ కలక్షన్స్ కలలను తీర్చలేకపోయింది.  

అయితే అనూహ్యంగా ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించిన రెండు భాగాలకు సంబంధించి ఇప్పుడు ఈమూవీ ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల బిజినెస్ చేయబోతోంది అని వస్తున్న వార్తలు చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. కొందరైతే ఇది అంతా ఎన్టీఆర్ బయోపిక్ కు హైక్ కలిగించడం కోసం సృష్టిస్తున్న వార్తలు అని అంటున్నారు. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 1 ‘కథానాయకుడు’ కు 70 కోట్ల బిజినెస్ జరిగింది అని అంటున్నారు. ఈమూవీకి ప్రస్తుతం కొనసాగుతున్న హైక్ రీత్యా ఈ బయోపిక్ రెండవ భాగం ‘మహానాయకుడు’ కు కూడ ఇదే స్థాయిలో ఆఫర్లు వస్తున్న నేపధ్యంలో ఈమూవీ సెకండ్ పార్ట్ కు కూడ మరో 70 కోట్ల బిజినెస్ జరగబోతోంది అని అంటున్నారు.

అదేవిధంగా ఈసినిమా తమిళ హిందీ డబ్బింగ్ రైట్స్ అమ్మడం ద్వారా మరో 20 కోట్లు ఈమూవీ శాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్ అమ్మడం ద్వారా మరో 40 కోట్లు బాలయ్యకు రావడం ఖాయం అని అంటున్నారు. ప్రస్తుతం ఈమూవీకి కొనసాగుతున్న హైక్ రీత్యా సంక్రాంతి సీజన్ కూడ కలిసి రావడంతో ఈమూవీ ప్రధమ భాగం ‘కథానాయకుడు’ కు ఖచ్చితంగా బాలయ్య కలలు కంటున్న 100 కోట్ల కలక్షన్స్ మార్క్ ను అందుకుంటుందనీ ఇప్పటికే ఈమూవీ రషస్ చూసినవారు అంటున్నారు. ఇదే నిజం అయితే బాలయ్య ఇప్పటి వరకు చేరుకోలేని రికార్డులను సీనియర్ ఎన్టీఆర్ సహకారంతో అందుకోబోతున్నాడు అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: