టాప్ హీరోల అభిమానులు తమ హీరోల సినిమాలు రికార్డుల విషయమై ఒకరి పై ఒకరు పోటీగా కామెంట్స్ చేసుకుంటూ ఉంటారు. ఒకోకసారి ఈఅభిమానం శృతిమించి అభిమానుల అత్యుత్సాహానికి నిదర్శనంగా మారిన సందర్భాలు గతంలో చాల ఉన్నాయి. హీరోలు తామంతా ఒక్కటే అని బయటకు చెపుతున్నా బయట జరిగే అభిమానుల వార్ ను కట్టడి చేయడానికి ఎప్పుడు ప్రయత్నించరు.
జైపూర్‌లో రాజమౌళి ఫ్యామిలీ
ఇప్పుడు కార్తికేయ పెళ్లి ఫంక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ ఖరీదు వ్యవహారం టాప్ హీరోల అభిమానుల మధ్య చిచ్చు రేపుతోంది. నిజంగా ఈ వాచ్ రెండు కోట్ల విలువతో ఉందా ? లేదా అన్న విషయం పక్కకు పెడితే జూనియర్ పెట్టుకున్న ఈ వాచ్ ఖరీదు మహేష్ బాబు సినిమాలకు సంబంధించి ఒక ఏరియాలో వచ్చిన కలక్షన్స్ కంటే ఎక్కువ అంటూ కొందరు జూనియర్ అభిమానులు మహేష్ అభిమానులను టార్గెట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. 
జైపూర్ ఫైవ్‌స్టార్ హోటల్‌లో
అంతేకాదు ఎన్టీఆర్ సత్తా ఏమిటో అతడు పెట్టుకున్న వాచ్ ఖరీదు బట్టి కనిపిస్తోంది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న ఈ కామెంట్స్ టాప్ హీరోల అభిమానుల పిచ్చికి పరకాష్టగా మారింది. ‘భరత్ అనే నేను’ మూవీ ఫంక్షన్ కు జూనియర్ వచ్చి మహేష్ ను పొగడటమే కాకుండా తామిద్దరం ఒక్కటే అన్న సంకేతాలు ఇచ్చాడు.
ప్రభాస్, రానా, ఎన్టీఆర్‌తో
అయితే ఈవిషయాలను పట్టించుకునే స్థితిలో అభిమానులు లేరు. మరికొందరు జూనియర్ అభిమానులు అయితే చరణ్ టార్గెట్ చేస్తూ ఇంత ఖరీదైన వాచ్ ఎప్పుడైనా పెట్టుకున్నావా అంటూ మరో ట్విస్ట్ ఇస్తున్నారు.   అయితే  మహేష్‌బాబు సినిమా వసూళ్ళతో ఏ అభిమానికైనా లాభం వుంటుందా.? చరణ్‌ రెమ్యునరేషన్‌లో కొంతైనా అభిమానులకు తిరిగిస్తాడా.? లేకపోతే జూనియర్ తనకు వచ్చే భారీ పారితోషికంలో కొంత శాతం అయినా తన అభిమానుల కోసం ఎప్పుడైనా ఖర్చు పెట్టాడా అనే ఆలోచన చేయకుండా టాప్ హీరోల అభిమానులు తమ పిచ్చి ప్రేమను కొనసాగిస్తూ  చేస్తున్న సోషల్ మీడియా వార్ దేనికి సంకేతం అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి ...


మరింత సమాచారం తెలుసుకోండి: