తెలుగు ఇండస్ట్రీలో మకుటం లేని మహరాజుగా వెలిగిపోయిన మహానటులు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘ఎన్టీఆర్’బయోపిక్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో జరిగింది. ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు గా రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే.
Image result for ntr biopic stills
ఆయన నటనా జీవితం ఆధారంగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, రాజకీయ జీవితం ఆధారంగా ‘ఎన్టీఆర్ మహానాయకుడు’గా రిలీజ్ చేయబోతున్నారు.  ఈ  చిత్రంలో ప‌లువురు ప్ర‌ముఖ న‌టులు క‌నిపించ‌నున్న సంగ‌తి తెలిసిందే.  సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 9వ తేదీన ఈ సినిమా మొద‌టి భాగం విడుద‌ల కాబోతోంది.
Image result for ntr biopic stills
ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విడుద‌లైన చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ట్రైల‌ర్‌ను యూట్యూబ్‌లో కోటి మంది వీక్షించారు. ఆ విష‌యాన్ని తెలియ‌జేస్తూ చిత్ర‌బృందం ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ సినిమా రెండో భాగం ఫిబ్ర‌వరి 7వ తేదీన విడుద‌ల కాబోతున్న సంగ‌తి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: