అందాల తార రోజా వయస్సు 45 ఏళ్లు దాటింది. కానీ ఈ వయస్సులోనూ గ్లామర్ మెయింటైన్ చేస్తూ ఔరా అనిపిస్తోంది. ఓవైపు ప్రజాప్రతినిధిగా రాణిస్తూనే.. మరోవైపు సినిమాలు, టీవీ కార్యక్రమాల్లోనూ సందడి చేస్తోంది. జబర్దస్త్ ప్రోగ్రామ్‌లో ఆమె ఎంట్రీ సాంగ్‌ ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉన్నాయి.



తాజాగా.. న్యూఇయర్ సందర్భంగా ఓ ఛానల్ నిర్వహించిన షో లో ఆమె శేఖర్ మాస్టర్‌ తో చేసిన డ్యాన్స్ అందర్నీ ఆశ్చర్యపరిచింది. రాధా గోవిందా.. పూర్తి పాటకు ఆమె, శేఖర్ మాస్టర్ నృత్యం చేసి అలరించారు. వయస్సు మీద పడుతున్నా హుషారుగా ఆమె నృత్యం చేసింది.


డాన్స్ మాస్టర్ శేఖర్ కు దీటుగా స్టెప్స్ వేసి అందరి ప్రశంసలు అందుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో నటుడు నాగబాబును కామెంట్స్ అడిగితే.. శేఖర్ మాస్టర్‌ను, నిన్ను జడ్జ్‌ చేయగలమా.. హ్యాట్సాఫ్‌ అంటూ అభినందనలు కురిపించారు.


రోజా హీరోయిన్‌ గా సినిమాలు చేసి దాదాపు 20 ఏళ్లు కావస్తున్నా.. ఇప్పటికీ డ్యాన్స్ విషయంలో సత్తా చాటడం నిజంగా మెచ్చుకోదగిన విషయమే. అటు పాలిటిక్స్ లో యాక్టివ్‌గా ఉంటూనే ఇటు యాంకర్‌గానూ రాణిస్తూ డ్యూయర్ రోల్‌ పోషిస్తోంది రోజా.


మరింత సమాచారం తెలుసుకోండి: