ఎట్టకేలకు అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల మూవీ అధికారికంగా ప్రకటింప బడటంతో ఈమూవీలో నటించబోయే హీరోయిన్ ఎంపిక అదేవిధంగా ఈమూవీకి సంబంధించిన సంగీత దర్శకుడి ఎంపిక పై త్రివిక్రమ్ ఆలోచనలు కొనసాగుతున్నట్లు సమాచారం. వాస్తవానికి ఈసినిమాకు అనిరుద్ చేత మ్యూజిక్ చేయించాలని త్రివిక్రమ్ ఆలోచన అని అంటున్నారు.
మళ్లీ అదే సెంటిమెంట్
‘అజ్ఞాతవాసి’ ఫెయిల్ అయినా ఆడియో పరంగా ఆసినిమాలోని పాటలు పాపులర్ అయిన నేపధ్యంలో తిరిగి అనిరుధ్ చేత బన్నీ సినిమాకు పాటలు ట్యూన్ చేయించాలి అన్న ఆలోచనలు ఇప్పటికే త్రివిక్రమ్ మనసులో ఉందని తెలుస్తోంది. అయితే అనిరుధ్ విషయంలో జూనియర్ ‘అరవింద సమేత’ సమయంలో తిరస్కరణ ఇచ్చిన నేపధ్యంలో ఈవిషయమై అల్లు అర్జున్ ను ఎలా ఒప్పించాలి అన్న ఆలోచనలలో త్రివిక్రమ్ ఉన్నట్లు సమాచారం. 
కొంచెం కొత్తగా
అయితే బన్నీకి దేవిశ్రీప్రసాద్ పై ఉన్న ప్రేమ రీత్యా అతడు తిరిగి దేవిశ్రీప్రసాద్ పేరును సూచించినా ఈమధ్య కాలంలో దేవిశ్రీ ట్యూన్స్ అన్నీ రొటీన్ గా అయిపోతున్న విషయాలను వివరించి అల్లు అర్జున్ మనసు మార్చి అనిరుధ్ వైపు మళ్ళించాలని త్రివిక్రమ్ వ్యూహాలు రచిస్తున్నట్లు టాక్. అయితే ఇప్పటికే ‘నాపేరు సూర్య’ ప్రయోగంతో షాక్ తిన్న అల్లు అర్జున్ అనిరుధ్ ప్రయోగానికి అంగీకరించకపోవచ్చు అన్న వార్తలు వస్తున్నాయి. 
సొంత బ్యానర్‌లోనే
ఇది ఇలా ఉండగా ఈసినిమాకు సంబంధించి పెట్టుబడి విషయంలో కూడ ఒక క్లారిటీ వచ్చింది అని అంటున్నారు. ఈమూవీని త్రివిక్రమ్ సన్నిహితుడు రాథాకృష్ణ అల్లు అరవింద్ లు కలిసి భాగస్వామ్య పద్దతిలో నిర్మించబోతున్నారు. ఈసినిమాకు బడ్జెట్ పెరగకుండా అల్లు అర్జున్ పారితోషికం తీసుకోకుండా ఈమూవీ బిజినెస్ తరువాత వచ్చే లాభాలలో వాట తీసుకునే విధంగా ఒక ప్రాధమిక అంగీకారానికి వచ్చినట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: