మరో ఐదు రోజులలో విడుదల కాబోతున్న ఎన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’ మూవీకి ఇప్పటి వరకు సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడం చాలమందిని ఆశ్చర్య పరుస్తోంది. ముఖ్యంగా ఈసినిమాకు సంబంధించిన మొదటి భాగం ‘కథానాయకుడు’ లో ఎటువంటి వివాదాస్పద విషయాలు లేకపోయినా సెన్సార్ సర్టిఫికేట్ ఆలస్యం వెనుక ఒక కారణం ఉంది అంటున్నారు.

ఈమధ్య కాలంలో బయోపిక్ మూవీల నిర్మాణం పెరిగి పోవడంతో ఆ సినిమాలకు సంబంధించి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చే ముందు ఆ బయోపిక్ కు సంబంధించి ఇప్పటికీ జీవించి ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి ఎన్ఒసి లు సబ్ మిట్ చేయాలి అన్న కండిషన్ వల్ల సెన్సార్ సర్టిఫికేట్ ఆలస్యం అవుతోంది అని అంటున్నారు. అయితే ఈసినిమాకు సంబంధించి ‘కథానాయకుడు’ పార్ట్ వన్ లో ఎటువంటి వివాదాలు లేవు అని దర్శకుడు క్రిష్ చెప్పినా సెన్సార్ బోర్డ్ ఈ ఎన్ఒసి లు అడగడంతో క్రిష్ ఇప్పుడు హడావిడిగా ఆ ఎన్ఒసి లు కలెక్ట్ చేసే పనిలో బిజీగా ఉన్నట్లు టాక్.

అయితే ఈసినిమాకు సంబంధించిన రెండవ భాగం ‘కథానాయకుడు’ విషయంలో ఈ  ఎన్ఒసి లు వ్యవహారం కొంత తలనొప్పిగా మారే ఆస్కారం ఉంది అని అంటున్నారు. ముఖ్యంగా ఈ మూవీ రెండవ భాగంలో వచ్చే రాజకీయ నాయకులు ఇంకా బ్రతికి ఉన్న నేపధ్యంలో ఈ సమస్యలు ఉత్పన్నం అయ్యే ఆస్కారం ఉంది. 

ఇది ఇలా ఉండగా ఈచిన్న సమస్యలు అన్నీ అధిగమించి ఈమూవీకి ఈరోజు సెన్సార్ సర్టిఫికెట్ వస్తుంది అని అంటున్నారు. ఈనెల 8వ తారీఖు రాత్రి అమెరికాలోని అనేక ప్రాంతాలతో పాటు విజయవాడ గుంటూరు ప్రాంతాలలో కూడ ఈమూవీకి సంబంధించిన ప్రీమియర్ షోలు భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ఈమూవీకి సంబంధించి ఓపెనింగ్ కలక్షన్స్ విషయంలో ఎటువంటి సందేహాలు లేకపోయినా ఈమూవీకి వచ్చే టాక్ ను బట్టి 100 కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈమూవీ భవితవ్యం ఆధారపడి ఉంటుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: