సీనియర్ హీరోలలో వెంకటేష్ ది ఒక ప్రత్యేక స్థానం. చాలామంది టాప్ హీరోలకు ఉన్నట్లుగా అతడికి వీరాభిమానులు లేకపోయినా అతడిని ఇప్పటికీ అభిమానించే అభిమానులు ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో వెంకటేష్ పై వచ్చిన ఒక న్యూస్ అతడి అభిమానులను అభిమానులను రెండుగా చీల్చింది. 

వాస్తవానికి ఈ న్యూస్ పై వెంకటేష్ ఇంత వరకు స్పందించకపోయినా ఆన్యూస్ సృష్టించిన రగడ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. స్టార్ మాకు సంబంధించిన ‘బిగ్ బాస్’ సీజన్-3కి వెంకీ వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నాడు అంటూ వచ్చిన లీకుల పై వెంకీ అభిమానులు రెండు విధాలుగా స్పందిస్తూ ఏకంగా వెంకీని అయోమయంలోకి నెట్టేస్తున్నారు.  

 ఫస్ట్ లుక్ పై అసహనంలో వెంకటేష్ !
స్టార్ మా యాజమాన్యం పిలుపును అందుకుని ‘బిగ్ బాస్’ గా వ్యవహరించవద్దని వెంకటేష్ అభిమాను వేలసంఖ్యలో అతడికి మెసేజ్ లు పెడుతున్నట్లు సమాచారం. దీనికి కారణం ఇప్పటివరకు మిస్టర్ క్లీన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న వెంకటేష్ ‘బిగ్ బాస్’ షో చేస్తే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని వెంకీ అభిమానులలోని ఒక వర్గం భయపడుతోంది. 
 ఫస్ట్ లుక్ పై అసహనంలో వెంకటేష్ !
అయితే వెంకటేష్ అభిమానులలో ఒక వర్గం ఇలాంటి షోలు చేయడం ద్వారా వెంకీ ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత దగ్గరై అతడి ఇమేజ్ పెరిగే ఆస్కారం ఉంది అని అభిప్రాయ పడుతున్నారు. అయితే ‘బిగ్ బాస్’ లాంటి అడల్ట్ కంటెంట్ ఉన్న షోను రక్తికట్టించడంలో ఫ్యామిలీ హీరోగా పేరు ఉన్న నాని ఘోరంగా ఫెయిల్ అయిన నేపధ్యంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వెంకటేష్ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని వస్తున్న సూచనలు ఈ విక్టరీ హీరో ఎంత వరకు సీరియస్ గా ఆలోచిస్తాడో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: