ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడవిన్నా ఎన్టీఆర్ బయోపిక్ గురించి వార్తలే వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈసినిమాకు దర్శకుడుగా క్రిష్ కాకుండా వేరే వ్యక్తి దర్శకత్వం వహించి ఉంటే ఈ రేంజ్ లో ఈమూవీకి ఈ క్రేజ్ ఏర్పడి ఉండేది కాదు. మొదట్లో ఈసినిమాకు దర్శకత్వం వహించాలని ప్రయత్నించిన తేజా ఈమూవీకి వ్రాసుకున్న స్క్రీన్ ప్లేన్ అంతా పూర్తిగా క్రిష్ మార్చివేసాడు అని తెలుస్తోంది. 

ఈసినిమాలోని ప్రతి సీన్ లోను క్రిష్ పనితనం కనిపిస్తుంది అని అంటున్నారు. విడుదల కాకుండానే ఈమూవీకి 100 కోట్ల బిజినెస్ జరగడంతో ఈ బయోపిక్ వల్ల బాలకృష్ణకు సుమారు 40 కోట్ల లాభం వచ్చింది అన్న వార్తలు హడావిడి చేస్తున్నాయి. దీనితో ఇంత భారీ బిజినెస్ చేసిన ఈమూవీతో క్రిష్ కు వచ్చిన పారితోషికం ఎంత అన్న కోణంలో ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. 


తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీకి దర్శకత్వం వహించిన క్రిష్ కు 10 కోట్ల పారితోషికం అందినట్లు సమాచారం. చాలామంది భావిస్తున్నట్లుగా ఈమూవీ బిజినెస్ లో క్రిష్ కు షేర్ లేదనీ కేవలం పారితోషికంతో సరిపెట్టారని టాక్. వాస్తవానికి ఈసినిమాకు అయిన బిజినెస్ తో క్రిష్ కు ఇచ్చిన పారితోషికం పోల్చుకుంటే అంత పెద్దది కాకపోయినా క్రిష్ తనకు వ్యక్తిగతంగా ఏర్పడ్డ ఒక కమిట్ మెంట్ వల్ల ఈమూవీకి పారితోషికంతో సద్దుకున్నట్లు టాక్. 


దీనికితోడు ఈసినిమా ప్రారంభించినప్పుడు ఈ స్థాయిలో ఈమూవీకి బిజినెస్ అవుతుందని క్రిష్ కూడ ఊహించలేదు అని అంటున్నారు. ఈమధ్య క్రిష్ వరుణ్ తేజ్ తో నిర్మించిన ‘అంతరిక్షం’ ఫెయిల్ అయిన నేపధ్యంలో ఎన్టీఆర్ బయోపిక్ లో వచ్చిన పారితోషికం ఆ నష్టాలకు సరిపోతుంది అని అంటున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ కు జరిగిన భారీ బిజినెస్ తో క్రిష్ కు ఆర్ధికంగా పెద్దగా కలిసి రాకపోయినా టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలో ఒక అపూర్వమైన సినిమాకు దర్శకత్వం వహించాడు అన్న పేరు క్రిష్ కు చిరస్థాయిగా నిలిచిపోయే ఆస్కారం ఉంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: