ఇప్పుడు దేశవ్యాప్తంగా బయోపిక్ ల హవా నడుస్తోంది. తెలుగులోనూ ఈ ట్రెండ్ జోరుగా సాగుతోంది. అందులోనూ ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో పొలిటికల్ బయోపిక్స్ సంచలనం సృష్టిస్తున్నాయి.

Related image


ఎన్టీఆర్‌, వైఎస్సార్. ఇద్దరు మహానేతల జీవిత చరిత్రలు తెరకెక్కుతున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్‌ రెండు భాగాలుగా విడుదలకు సిద్ధం కాగా.. వైఎస్సార్ బయోపిక్ యాత్ర కూడా శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. ఇందులో వైఎస్సార్ పాత్రను మమ్ముట్టి పోషిస్తున్న సంగతి తెలిసిందే.

Image result for yatra movie vs ntr movie


ఇప్పుడు తాజాగా వైఎస్‌ తండ్రి వైఎస్ రాజారెడ్డి పాత్రను పోషిస్తున్న జగపతిబాబు లుక్ బయటకు వచ్చింది. వైఎస్‌ రాజారెడ్డి ఫోటో పెద్ద మీసాలతో ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే జగపతి బాబు కూడా మీసాలు పెంచారు.

Image result for yatra movie jagapathibabu


ఈ సినిమాలో వైఎస్ పాత్రకు దీటుగా తండ్రి పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుందట. అందుకే జగపతిబాబు వంటి సీనియర్‌ను ఆ పాత్రకు ఎంపిక చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్ వారెవా అనిపిస్తుండగా.. తాజాగా జగపతిబాబు లుక్ కూడా అదిరిపోయింది. ఫిబ్రవరి 8 న ఈ రాజకీయ యాత్ర తెరపైకి వస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: